ఎన్టీఆర్-ప్రణతి దంపతులకు అభయ్‌రామ్ అనే బాబు ఉన్నాడు. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ మరోబిడ్డకు తండ్రి అయ్యాడని, ఎన్టీఆర్‌కి పండంటి పాప పుట్టిందనే వార్త వైరల్‌గా వ్యాపించింది. దాంతో ఇది నిజమేనని నమ్మిన ఆయన అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకోవడంతోపాటు ఈ వార్తను తమకు తెలిసిన అందరితో పంచుకుని ఆనందపడ్డారు. కానీ ఎన్టీఆర్ కి పాప పుట్టిందనే వార్తల్లో నిజంలేదని ఎన్టీఆర్ పిఆర్‌ఓ మహేష్‌కోనేరు తెలిపాడు. దాంతో ఈ న్యూస్ కేవలం ఫేక్ అని నిర్దారణ అయింది.
ఇక ప్రణతి ప్రస్తుతం గర్బవతి అనేది మాత్రం నిజం. ఇటీవలే తనకు సంబంధించిన ప్రముఖులు,సన్నిహితులు, బంధువుల సమక్షంలో ప్రణతికి శ్రీమంతం జరిపారు. ఎన్టీఆర్ రెండోసారి తండ్రి కానున్నప్పటికీ దానికి కాస్త వ్యవధి ఉండే అవకాశం ఉందని, త్వరలో ఆ శుభవార్త వినవచ్చనేది మాత్రం నిజమేనని సమాచారం. మరోవైపు ఎన్టీఆర్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నాడు.
ఇటీవల ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ భీమవరం వెళ్లి అక్కడ మామూళ్లమ్మకి పూజలు నిర్వహించి, అమ్మవారికి కానుకలు బహూకరించిన విషయం తెలిసిందే. త్వరలో తమ ఇంట్లోకి కొత్త సభ్యుడు లేదా సభ్యురాలు రానున్న సందర్భంగానే ఆమె ఈ పూజలు నిర్వహించిందని వార్తలు వచ్చాయి. ఏదిఏమైనా ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఏది నిజం? ఏది అబద్దం? అనేది కూడా తెలియకుండా ఉంది. అంతా టెక్నాలజీ మాయ...! ఇది రెండు వైపులా పదునున్న కత్తి వంటిదని ఊరికే అనలేదు!