Advertisementt

మహేష్ న్యూ లుక్ సినిమా కోసం కాదండీబాబు!

Fri 08th Jun 2018 07:07 PM
mahesh babu,new look,beard,moustache look  మహేష్ న్యూ లుక్ సినిమా కోసం కాదండీబాబు!
Super Star Mahesh Babu Look not Finalised మహేష్ న్యూ లుక్ సినిమా కోసం కాదండీబాబు!
Advertisement
Ads by CJ

నిన్న బుధవారం సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఒకటే న్యూస్ హైలెట్ అయ్యింది. అదేమిటంటే మహేష్ బాబు తన 25 మూవీ కోసం కొత్తగా మేకోవర్ అయ్యి న్యూ లుక్ ట్రై చేశాడు.. అదే ఈ లుక్ అంటూ మహేష్ ముంబై ఎయిర్ పోర్ట్ లో ఉన్న లుక్ ని చూపిస్తూ రకరకాల కథనాలు మీడియాలో హల్చల్ చేశాయి. ఇక ముంబై ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు కొద్దిగా రఫ్ గా గెడ్డం పెంచి కొత్తగా కనబడడంతో అందరూ మహేష్ - వంశి పైడిపల్లి కాంబోలో రాబోయే సినిమాలో మహేష్ న్యూ లుక్ అంటూ  అందరూ ఫిక్స్ అయ్యారు కూడా. అయితే మహేష్ తన 25 వ మూవీ కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు... కానీ ప్రస్తుతం మహేష్ గెడ్డం లుక్ న్యూ లుక్ కాదట. కేవలం ప్రయోగమేనట.

మహేష్ బాబు తన కొత్త సినిమా కోసం న్యూ అండ్ స్పెషల్ లుక్ కోసం ట్రై చెయ్యడమే కాదు... ఫిట్నెస్ విషయంలో కూడా మేకోవర్ అవుతున్నాడట. అయితే మహేష్ ఇప్పుడు కనిపించిన గెడ్డం లుక్ ఫైనల్ కాదని.. మహేష్ కోసం ఆయన వైఫ్ నమ్రత స్పెషల్ కేర్ తీసుకోవడమే కాదు.. హాలీవుడ్ నుండి మహేష్ లుక్ ని సెట్ చెయ్యడం కోసం ఒక స్పెషల్ లిస్ట్ కూడా హైదరాబాద్ కి రప్పిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే భార్య నమ్రత చెప్పినట్టుగా హెయిర్ అండ్ బియర్డ్ స్టైల్ లో మహేష్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. 

మరి ఒకసారి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 1 నేనొక్కడినే సినిమా కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేసిన మహేష్ బాబు.. సిక్స్ ప్యాక్ ఏమోకానీ తన మొహంలో ఉన్న కళను పోగొట్టుకుని విమర్శల పాలయ్యాడు. మాములుగా ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకోని మహేష్ బాబు, వంశి పైడిపల్లి సినిమా కోసం కొత్తగా ట్రై చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే స్పెషలిస్ట్ ల ఆధ్వర్యంలో మహేష్ ఫుల్ మేకోవర్ అవుతున్నాడట. అదన్నమాట విషయం నిన్న మహేష్ బాబు ముంబై ఎయిర్ పోర్ట్ లుక్ వంశి సినిమాలో ఫైనల్ కాదన్నమాట. ఇక మహేష్ బాబు పూర్తిగా కొత్త లుక్ లోకి మారాక స్పెషల్ ఫోటో షూట్ నిర్వహిస్తారట. ఇక వంశి - మహేష్ ల మూవీ మరికొద్ది రోజుల్లోనే సెట్స్ మీదకెళ్లనున్నట్టుగా తెలుస్తుంది.

Super Star Mahesh Babu Look not Finalised:

Mahesh Babu Caught in Beard and Moustache Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ