Advertisementt

మహానటి మనసుకు హ‌త్తుకుంది: మెగా హీరో!

Fri 08th Jun 2018 07:38 PM
ram charan,mahanati,keerthi suresh,touched my heart  మహానటి మనసుకు హ‌త్తుకుంది: మెగా హీరో!
Ram charan Praises on Mahanati మహానటి మనసుకు హ‌త్తుకుంది: మెగా హీరో!
Advertisement
Ads by CJ

కీర్తి సురేష్ సావిత్రి రోల్ లో నటించిన మహానటి మూవీ విడుదలై అప్పుడే నెల గడుస్తోంది. ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ని పరిశ్రమలోని ప్రతి ఒక్కరు పొగడటమే కాదు.. మెగాస్టార్ చిరు, అల్లు అర్జున్ వంటి వారు ఇంటికి పిలిచి మరీ ఏకంగా మహానటి టీమ్ ని సత్కరించారు కూడా. ఇక ప్రతి ఒక్కరు సావిత్రి రోల్ లో మెప్పించిన కీర్తి సురేష్ ని ఆకాశానికెత్తేశారు. సినిమాని మహాద్భుతంగా తీర్చిదిద్దిన నాగ్ అశ్విన్ ని వెయ్యినోళ్ల పొగిడారు. చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్క స్టార్ కూడా మహానటిని పొగిడిన వారే కానీ పొగడని వారు లేరు. అయితే కాస్త లేట్ గా అంటే సినిమా విడుదలైన ఒక నెలకి మహానటి టీమ్ ని తెగ పొగిడేస్తున్నాడు మెగా హీరో రామ్ చరణ్.

కాస్త ఆలస్యంగా రామ్ చరణ్ స్పందించడానికి కారణం.. ఆయన బిజీ షెడ్యూల్. అందువల్లే మహానటిని లేట్ గా వీక్షించిన రామ్ చరణ్ మహానటి టీమ్ ని సోషల్ మీడియాలో తెగ పొగిడేశాడు. మహానటి సినిమా త‌న మ‌న‌సుకు హ‌త్తుకుంద‌ని... త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. మహానటి సినిమా నా మనసుకు హ‌త్తుకుంది. సాటి న‌టుడిగా ఆ సినిమా నాపై చెర‌గ‌ని ముద్ర వేసింది. ఆ మ‌హాన‌టి పాత్ర‌ను ఎంతో అంకితభావంతో, ప్రేమ‌తో, గౌర‌వంతో తీర్చిదిద్దిన‌ నాగ్ అశ్విన్ కు హ్యాట్సాఫ్. మ‌హాన‌టిగా కీర్తి సురేష్ న‌ట‌న అద్భుతం. ఆ పాత్రకు కీర్తి సురేష్ త‌ప్ప మ‌రెవ‌రూ న్యాయం చేయ‌లేరు.

అలాగే ఇంకా ఆ సినిమాలో నటించిన సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ల నటన కూడా ఎంతో సహజంగా వుంది. నాగ్ అశ్విన్ ఎంతో అంకితభావంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇంతగొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాతలకి శుభాకాంక్షలు.. అంటూ మహానటిపై తన మనసులోని భావాలని సోషల్ మీడియాలో అందరితో పంచుకున్నాడు.

Ram charan Praises on Mahanati:

Mahanati Touched My Heart Says Ram Charan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ