Advertisementt

ఎన్టీఆర్ కి- కమెడియన్ కి మధ్య కోల్డ్ వార్..!

Sat 09th Jun 2018 08:23 PM
jr ntr,srinivasa reddy,cold war,trivikram srinivas,aravinda sametha,ego  ఎన్టీఆర్ కి- కమెడియన్ కి మధ్య కోల్డ్ వార్..!
Jr NTR Ego War With Star Comedian ఎన్టీఆర్ కి- కమెడియన్ కి మధ్య కోల్డ్ వార్..!
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత' షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. మాటల మాంత్రికుడు కూడా ఎన్టీఆర్ వేగాన్ని అందుకుంటూ షూటింగ్ ని శరవేగంగా కానిచ్చేస్తున్నాడు. మే 20 న 'అరవింద సమేత' ఫస్ట్ లుక్ తో సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ కొత్త సినిమా మళ్ళీ ఇన్నాళ్లకు మరో హాట్ హాట్ న్యూస్ తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అదేమిటంటే.. 'అరవింద సమేత వీర రాఘవ' సెట్స్ లో ఎన్టీఆర్ కి ఒక స్టార్ కమెడియన్ కి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకొని... అది కాస్తా కోల్డ్ వార్ గా మారిందనే న్యూస్ వెబ్ అండ్ సోషల్ మీడియాలో తెగ హైలెట్ అయ్యింది.

ఆ స్టార్ కమెడియన్ ఎవరో కాదు.. ఒకప్పుడు ఎన్టీఆర్ స్నేహితుడు.. ఇప్పుడు కమెడియన్ కమ్ హీరోగా కెరీర్ లో దూసుకుపోతున్న శ్రీనివాస్ రెడ్డి. ఒకప్పుడు అంటే గతంలో ఒకసారి ఎన్టీఆర్ టిడిపి తరుపున ఎన్నికల ప్రచారం వరకు బాగా కలిసున్న ఎన్టీఆర్ - శ్రీనివాస్ రెడ్డి లు ఆ తర్వాత సైలెంట్ గా విడిపోయారు. అసలెందుకు వారిమద్యలో గ్యాప్ వచ్చిందో.. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి ఒక ఛానల్ ఇంటర్వ్యూ లో చెప్పాడు. కానీ అది నిజం కాదనేది కొందరి వాదన. సరే ఇప్పుడు 'అరవింద సమేత' లో కమెడియన్ గా శ్రీనివాస రెడ్డి ని తీసుకుందామన్న.. త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ వద్దని చెప్పినా.. ఆ కేరెక్టర్ కి శ్రీనివాస్ రెడ్డి అయితే బావుంటుందని త్రివిక్రమ్, ఎన్టీఆర్ ని కన్విన్స్ చేయడంతో ఎన్టీఆర్ ఒకే అన్నాడట. అయితే అలా ఒకే అన్నప్పటికీ.. శ్రీనివాస్ రెడ్డి 'అరవింద సమేత' షూటింగ్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి.. ఎన్టీఆర్ అతనిని పలకరించడం కానీ, కనీసం మొహం తిప్పి చూడడం కానీ చెయ్యకుండా ఇతర నటులతో కాలం గడిపేస్తున్నాడట. పాపం ఇదంతా శ్రీనివాస్ రెడ్డిని బాగానే ఇబ్బంది పెట్టిందట.

కానీ తనకి ఇవన్నీ ముఖ్యం కాదు.. తనకిచ్చిన పాత్రకి న్యాయం చెయ్యాలనే ఉద్దేశ్యంతోనే.. శ్రీనివాస్ రెడ్డి 'అరవింద సమేత' షూటింగ్ లో తన పార్ట్ కంప్లీట్ కాగానే సైలెంట్ గా తన కార్వాన్ లోకి వెళ్ళిపోతున్నాడట. ఇలా ఎన్టీఆర్ - శ్రీనివాస్ రెడ్డి ల మధ్యన కోల్డ్ వార్ ఒక రేంజ్ లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి అలా మొహామొహాలు చూసుకోకుండా షూటింగ్ ఎలా చేస్తారు? శ్రీనివాస్ రెడ్డి - ఎన్టీఆర్ కాంబో సీన్స్ లో ఇద్దరు మాట్లాడుకోవాలి? అలాగే వారిమధ్యన కామెడీ పండాలి అంటే.. ఇద్దరు అలా ఎడ ముఖాలు పెడ ముఖాలుగా ఉంటే త్రివిక్రమ్ మాత్రం షూటింగ్ ఎలా చేస్తాడు? అంటే.. ఎన్టీఆర్ - శ్రీనివాస్ రెడ్డి పై వస్తున్న ఆ వార్తలన్నీ అవాస్తవాలు కావొచ్చు? కాకపోనూ వచ్చు? ఏమో ప్రస్తుతం మాత్రం ఎన్టీఆర్ అండ్ శ్రీనివాస్ రెడ్డిల న్యూస్ మాత్రం ఫిలింసర్కిల్స్ లో బాగా హాట్ టాపిక్ అయ్యింది.

Jr NTR Ego War With Star Comedian:

>Aravinda Sametha: NTR Not In Talking Terms With Comedian Srinivas Reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ