Advertisementt

రామ్ తో సెట్ అవ్వక.. ధనుష్ దగ్గరకెళ్ళింది!

Sat 09th Jun 2018 08:39 PM
ram,praveen sattaru,psv garuda vega,dhanush,tamil hero  రామ్ తో సెట్ అవ్వక.. ధనుష్ దగ్గరకెళ్ళింది!
Praveen Sattaru Direct Tamil Hero Dhanush With Hero Ram Story రామ్ తో సెట్ అవ్వక.. ధనుష్ దగ్గరకెళ్ళింది!
Advertisement
Ads by CJ

మన టాలీవుడ్‌ హీరోలు ఒకేసారి ద్విభాషా చిత్రాలు చేసినా అవి పెద్దగా ఆడటం లేదు. ఏదో బన్నీకి కేరళ, రానా చిత్రాలు, 'బాహుబలి'తో ప్రభాస్‌ చిత్రాలు మాత్రమే బాగా ఆడాయి. రామ్‌చరణ్‌ బాలీవుడ్‌, టాలీవుడ్‌లలో చేసిన 'జంజీర్‌', తెలుగులో 'తుఫాన్‌' చిత్రం డిజాస్టర్‌ అయింది. ఇక మహేష్‌బాబు మురుగదాస్‌ దర్శకత్వంలో 'స్పైడర్‌'ని ఎంతో కష్టపడి తెలుగు, తమిళ భాషల్లో చేస్తే అదికూడా డిజాస్టర్‌ అయింది. ఇక సందీప్‌కిషన్‌ నుంచి శర్వానంద్‌, నాని వంటి వారు రెండు భాషల్లో ప్రయోగాలు చేసినా అవి వర్కౌట్‌ కావడం లేదు. 

కానీ కోలీవుడ్‌ స్టార్స్‌ రజనీ, కమల్‌, సూర్య, కార్తి, విశాల్‌ వంటి హీరోలు మాత్రం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా బాగానే రాణిస్తున్నారు. ఇక విషయానికి వస్తే 'పీఎస్వీ గరుడవేగ' చిత్రం రాజశేఖర్‌కి కమ్‌ బ్యాక్‌ మూవీ అయింది. కానీ బడ్జెట్‌ భారీగా ఖర్చుకావడంతో రాజశేఖర్‌కి ఉన్న పరిమిత బడ్జెట్‌ రీత్యా తీసుకుంటే మాత్రం ఈ చిత్రం కమర్షియల్‌గా వర్కౌట్‌ కాలేదు. అయినా దర్శకుడు ప్రవీణ్‌ సత్తార్‌ తగ్గేది లేదంటున్నాడు. ఆయన రామ్‌ హీరోగా భవ్య ఆర్ట్స్‌ క్రియేషన్స్ బేనర్‌లో ఓ చిత్రం చేయాల్సివుంది. కానీ ఈ చిత్ర నిర్మాతలు రామ్‌ స్టామినాకి మించి భారీగా బడ్జెట్‌ అవుతుందన్న ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని వదిలేశారు. 

ఆ తర్వాత ఇదే చిత్రాన్ని రామ్‌కి సొంత బేనర్‌ అయిన ఆయన పెద్దనాన్న 'స్రవంతి మూవీస్‌' బేనర్‌లో చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ రవికిషోర్‌, రామ్‌లు కూడా బడ్జెట్‌ దృష్ట్యా ప్రాజెక్ట్‌ని పక్కనపెట్టారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రవీణ్‌సత్తార్‌ తాజాగా ఈ కథని కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌కి చెప్పాడట. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా కలిసి తీస్తేనే బడ్జెట్‌ వర్కౌట్‌ అవుతుందనేది ఆలోచన. 

'రఘువరన్‌ బి.టెక్‌' చిత్రం తెలుగులో కూడా బాగానే ఆడటంలో మంచి స్టోరీ దొరికితే ధనుష్‌ తెలుగులోకి కూడా స్ట్రెయిట్‌ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రస్తుతం మారి కి సీక్వెల్‌ చేస్తోన్న ధనుష్‌ అంగీకారం కోసం ప్రవీణ్‌సత్తార్‌ వెయిటింగ్‌ చేస్తున్నాడు.

Praveen Sattaru Direct Tamil Hero Dhanush With Hero Ram Story:

Dhanush to replace Ram Pothineni in director Praveen Sattaru's Next 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ