రాజమౌళి తెరకెక్కించే మల్టీస్టార్రర్ మూవీపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో తెలిసిన విషయమే. ఈ సినిమా కోసం అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇద్దరూ ఎదురు చూస్తున్నారు. తొలిసారిగా ఓ మెగా హీరో మరియు నందమూరి హీరో నటిస్తున్న సినిమా కాబట్టి అందరిలోనూ ఆత్రుత ఉంది. సినిమాపై భారీగా అంచనాలు ఉండటంతో... రోజురోజుకి ఈ సినిమాపై అదేవిధంగా రూమర్స్ వస్తున్నాయి.
లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి రూమర్ బాగా వైరల్ అవుతుంది. ఇది పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందని ఒక టాక్ వచ్చింది. 1995 లో బాలీవుడ్ లో వచ్చిన కరణ్ అర్జున్ అనే సినిమాకు RRR రీమేక్ అని ఆ సినిమాలో షారుక్, సల్మాన్ నటిస్తే ఈ సినిమాలో తారక్, చరణ్ సరికొత్తగా కనిపించనున్నారు అనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది.
అయితే ఇదే విషయంపై ప్రొడ్యూసర్ డివివి.దానయ్య స్పందిస్తూ.. ఈ సినిమాపై వచ్చే రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని పూర్తి వివరాలు ఒక నెల తరువాత అందరికి తెలుస్తాయని చెప్పారు. అదేవిధంగా ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ లు తప్పితే ఇంకా ఎవరు ఫైనల్ కాలేదని మరి కొద్దీ రోజుల్లో పూర్తి వివరాలు తెలియజేస్తాం అని అప్పటివరకు ఈ వార్తలు నమ్మొద్దని క్లారిటీ ఇచ్చాడు. ఈ ఏడాది అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ చేసి 2020 సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నామని ఆయన క్లారిటీ ఇచ్చారు.