Advertisementt

నా దేవత ప్రణతి: మంచు మనోజ్‌!

Mon 11th Jun 2018 12:39 AM
manchu manoj,vaalla bonda,netizens,social media,divorce rumours  నా దేవత ప్రణతి: మంచు మనోజ్‌!
Manchu Manoj Quashes Divorce Rumours నా దేవత ప్రణతి: మంచు మనోజ్‌!
Advertisement
Ads by CJ

గతకొంతకాలంగా సినిమాల ద్వారా మంచుమనోజ్‌ వార్తల్లో లేకపోయినా ఆయన వ్యక్తిగతం జీవితం గురించి మాత్రం పలు యూట్యూబ్‌లు, ఇతర సోషల్‌ మీడియాలలో బాగానే సెన్సేషన్ అవుతున్నాడు. మంచు మనోజ్‌కి ఆయన భార్య ప్రణతికి విబేధాలు వచ్చాయని వారు కోర్టు మెట్లు కూడా ఎక్కనున్నారని ఆ వార్తల సారాంశం. దీనికి చెక్‌ పెడుతూ తాజాగా మనోజ్‌ తన భార్య ప్రణతితో దిగిన ఫొటోను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అయినా ఈ గాసిప్స్‌ ఆగలేదు. 

ఇక తాజాగా మంచు మనోజ్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా అభిమానులతో లైవ్‌చాట్‌ నిర్వహించాడు.ఇందులో ఓ నెటిజన్‌ మీరు ప్రణతి నుంచి విడాకులు తీసుకుంటున్నారట కదా...! పలు యూట్యూబ్‌ చానెల్స్‌లో వాటికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి? ఇంతకీ ప్రణతి మీద మీ అభిప్రాయం ఏమిటి? అని ప్రశ్నించాడు. దానికి మంచు మనోజ్‌ సమాధానం ఇస్తూ 'వాళ్ల బొంద, నా దేవత ప్రణతి. మేమెంతో అన్యోన్యంగా ఉన్నామని' తెలిపాడు. మరో నెటిజన్‌ తనకు రిప్లై కావాలని, రిప్లై కోసం ఎదురు చూసి, చూసి ఫోన్‌ని పగలగొట్టేలా ఉన్నానని అన్నాడు. దానికి మంచు మనోజ్‌ సమాధానం ఇస్తూ 'నో కోపం...లవ్యూ' అని పేర్కొన్నాడు. 

మరో నెటిజన్‌ కులం పేరుతో కొందరు రాజకీయ నాయకులు దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారని, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అని ప్రశ్నించగా.. 'మన ఖర్మ..బ్రిటిష్‌వారు మనకు డివైడ్‌ అండ్‌ రూల్‌ పాలసీని బాగా నేర్పించి వెళ్లారు' అంటూ సమాధానంఇచ్చాడు. ఇక మంచు మనోజ్‌ తదుపరి చిత్రం విషయంలో ఏ విషయం బయటకు రావడంలేదు. కొన్నిరోజుల కిందట తన అన్నయ్య, హీరో మంచు విష్ణు దర్శకత్వంలో మనోజ్‌ ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. మరి అవి ఎంత వరకు నిజమో అఫీషియల్‌గా వచ్చేవరకు చెప్పలేం! 

Manchu Manoj Quashes Divorce Rumours:

>Manchu Manoj Says Vaalla Bonda!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ