బిగ్‌బాస్ సీజన్1ని ఎన్టీఆర్ హోస్ట్ చేశాడు. ప్రారంభంలో ఆయన హోస్టింగ్‌లో కాస్తకృత్రిమత్వం కనిపించినా ఆ తర్వాత మాత్రం ఆయన పార్టిసిపెంట్స్‌తో బాగా కలిసి పోవడం, వారితో మమేకమై కలివిడిగా కలిసిపోతూ షోని రక్తికట్టించాడు. దీనికి తోడు బిగ్‌బాస్ సీజన్1లో పార్టిసిపెంట్ల సెలక్షన్ కూడా బాగుంది. ఇక ఒకే షోని ఇద్దరు నటులు చేస్తున్నప్పుడు సహజంగానే ఇద్దరి మద్య పోలికలు చర్చకు వస్తాయి. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' విషయంలో నాగార్జున, చిరంజీవి, కౌన్ బనేగా కరోడ్‌పతిలో అమితాబ్, షారుఖ్‌ల మధ్య కూడా ఈ పోలికలు నాడు హల్‌చల్ చేశాయి.
ఇక మన పక్కింటి అబ్బాయిలా ఉండే నేచురల్ స్టార్ నాని కూడా పార్టిసిపెంట్స్‌తో కలిసి పోయి షోని రక్తికట్టిస్తాడని భావించారు. కానీ భవిష్యత్తు సంగతేమో గానీ ఈ మొదటి వారం మాత్రం నాని పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. కేవలం హోస్ట్‌గా పనిచేస్తున్నాడే తప్ప ఇన్‌వాల్వ్‌మెంట్ తగ్గిందనే విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇక విషయానికి వస్తే 'బిగ్‌బాస్ సీజన్1'లో పాల్గొన్న కత్తి కార్తీక బిగ్‌బాస్ సీజన్ 2పై విమర్శలను ఎక్కుపెట్టింది. మరింత మసాలా అన్నారు. మసాలా బాగానే ఉంది గానీ అందులో ఫ్లేవర్ మాత్రం మిస్ అయింది.
మొదటి సీజన్‌లో ముగ్గురు తెలంగాణ వ్యక్తులను పార్టిసిపెంట్స్‌గా తీసుకున్నారు. కానీ రెండో సీజన్‌లో ఒక్క తెలంగాణ పార్టిసిపెంట్ కూడా లేకపోవడం బాధాకరం తెలంగాణ జానపదం, భాష, యాసల కోసం కొందరు తెలంగాణ వారికి కూడా చాన్స్ ఇస్తే బాగుండేది. ఈ విషయంలో నేను బాగా నిరాశకు గురయ్యాను. బిగ్‌బాస్ 1 కి ముందు నేను కేవలం తెలంగాణకు మాత్రమే తెలుసు. కానీ బిగ్‌బాస్ వల్ల ఏపీలో కూడా నాకు క్రేజ్ వచ్చింది అని చెప్పుకొచ్చింది. కార్తీక తన తెలంగాణ యాసతో వి6 చానెల్ ద్వారా తెలంగాణలో బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే.