Advertisementt

ఇక చిరుని చరణ్ వదిలేలా లేడుగా..!

Fri 15th Jun 2018 07:51 PM
chiranjeevi,ram charan,mythri movie makers,koratala siva film,produce  ఇక చిరుని చరణ్ వదిలేలా లేడుగా..!
Charan To Hit A Hat Trick With The Megastar and Koratala Film ఇక చిరుని చరణ్ వదిలేలా లేడుగా..!
Advertisement
Ads by CJ

చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో నిర్మాతగా మారిన చరణ్ తర్వాత తన తండ్రి మెయిన్ లీడ్ లో వస్తున్న 'సైరా' సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చరణ్ తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది.

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాలతో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈసారి చరణ్ కాకుండా బయట బ్యానర్ లో రూపొందుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

అయితే ఈ సినిమా నిర్మాణంలోను చరణ్ భాగస్వామ్యం ఉందనేది తాజా సమాచారం. చరణ్...మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారట. అంతేకాకుండా చిరంజీవి ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నాడు. రైతుగాను .. బిలియనీర్ గాను ఇందులో కనిపించబోతున్నట్టు టాక్. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడు కొరటాల. సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Charan To Hit A Hat Trick With The Megastar and Koratala Film:

Mythri movie makers and Ram Charan will produce Koratala Siva and Megastar chiranjeevi film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ