తెలుగులో మంచి యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో లాస్య ఒకరు. ఎంతో సంప్రదాయ బద్దంగా ఉండే ఈమె తాజాగా అమెరికాలో బయటపడిన టాలీవుడ్ సెక్స్ రాకెట్ గురించి స్పందించింది. తెలుగులో కాస్టింగ్ కౌచ్ బయట పడినట్లుగానే అమెరికాలో బయట పడిన సెక్స్ రాకెట్ కూడా బయటపడి నిజాలు బయటికి రావాలని లాస్య పేర్కొంది. నేను యాంకర్‌గా బిజీగా ఉన్నప్పుడే వివాహం చేసుకుని అమెరికాలో స్ధిరపడ్డాను. అక్కడి వారికి నేను యాంకర్‌గా పనిచేసే దానిని అని చెబితే నవ్వుతూ అదో రకంగా ప్రవర్తించే వారు. దాంతో నేను యాంకర్ని అన్న విషయం తెలియనివ్వవద్దని అందరినీ కోరుకునే దానిని. టాలీవుడ్లో 'కమిట్మెంట్' అని అడిగినట్లుగా అమెరికాలో 'షాపింగ్‌కి వస్తారా' అని అడుగుతారు. దానికి ఒప్పుకుంటే ఇక అన్నింటికి ఒప్పుకున్నట్లే అర్ధం. మొదట్లో నేను కూడా ఈవెంట్లలో పాల్గొనే దానిని. కానీ అక్కడి ఆర్గనైజర్లు తప్పుగా ప్రవర్తిస్తూ ఉండే సరికి ఓ సారి ఓ ఆర్గనైజర్‌కి వార్నింగ్ ఇచ్చాను. పద్దతిగా, సంప్రదాయంగా ఉండే వారి పట్ల కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు.
దాంతో ఈ ఈవెంట్ల జోలికి వెళ్లడం లేదు. దానికి కారణం కొందరు చెత్త వెధవలే. కుప్పలు తెప్పలుగా డబ్బు వస్తూ ఉండటంతో నటీమణులు కూడా వీటికి ఒప్పుకుంటున్నారు. దీనికి అమెరికాలో స్ధిరపడిన కొందరు పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవారే కారణమని కుండ బద్దలు కొట్టింది. అమెరికాలో స్ధిరపడిన మాలాంటి వారే ఆర్దికంగా పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. కానీ టాలీవుడ్ నుంచి వచ్చే టాప్‌హీరోయిన్లు, నటీనటులు, యాంకర్లు వంటి వారు ఇక్కడే నెలల తరబడి ఉండటానికి ఇదే కారణం. వాళ్లు సొంత ఖర్చులతో ఇక్కడకి రారు. ఇక్కడ ఉన్నన్నిరోజుల్లో ఇబ్బడిముబ్బడిగా డబ్బులు సంపాదించుకుని వెళ్తారు. చాలా మందికి ఆర్గనైజర్లు ఎందుకు పిలుస్తున్నారో తెలుసు. కానీ అన్నింటికి సిద్దపడే వారు ఇక్కడికి వస్తున్నారు.
తెలుగులో టాప్ హీరోయన్‌గా వెలిగి ప్రస్తుతం సెకండ్ హీరోయిన్గా చేస్తున్న ఓ హీరోయిన్ ఇక్కడ కొంతకాలం ఉండి ఏకంగా వ్యభిచారం ద్వారా 80లక్షలు సంపాదించింది. ఆమెకి రెమ్యూనరేషన్ కూడా అంత ఇవ్వరు. ఆ విషయాన్ని ఆమె ఎంతో గొప్పగా చెప్పుకునేది. ఓ సారి ఓ ఈవెంట్ ఆర్గనైజర్ నాకు ఫోన్ చేశాడు. నాకు ఇష్టం లేదని చెప్పాను. నీకంటే పెద్ద వారితోనే పడుకున్నాను.. నువ్వెంత ఆఫ్ట్రాల్ అన్నాడు. నా భర్తకి ఈ విషయం చెప్పిన తర్వాత ఆయన కూడా ఈవెంట్లకు వెళ్లవద్దని చెబుతున్నాడు. ఇండియా నుంచి నటీమణులను తెప్పిస్తారు గానీ ఇక్కడే స్ధిరపడిన తన లాంటి వారిని మాత్రం పిలవరు. దీనికి ఇదే కారణమని లాస్య తేల్చిచెప్పింది. ఈమె వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్నాయి.