కొందరు నటీనటుల మధ్య, ఇతర సినీ ప్రముఖుల మధ్య మంచి ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటాయి. అప్పట్లో నాగార్జునతో టబూ ఎంతో క్లోజ్‌గా ఉండటమే కాదు.. తాను ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన నాగ్ ఇంట్లోనే దిగేదని వార్తలు వచ్చాయి. ఇక చందమామ కాజల్ అగర్వాల్ అయితే మెగాబ్రదర్ నాగబాబు ఇంట్లోనే బస చేస్తూ ఆయన కూతురిలా ఎంతో సన్నిహితంగా మెలిగేది. ఇక తాజాగా విషయానికి వస్తే మహేష్‌బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'భరత్ అనేనేను' చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో మహేష్ సరసన, సీఎం భరత్‌కి ప్రేయసి పాత్రలో ఎంఎస్ ధోని పాప కైరాఅ ద్వానీ నటించింది. ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా కైరా అద్వానీకి మహేష్‌బాబు ఫ్యామిలీతో మరీ ముఖ్యంగా మహేష్ శ్రీమతి నమ్రతా శిరోద్కర్‌తో మంచి స్నేహం కుదిరింది. ఎంతలా అంటే కైరా అద్వానీ హైదరాబాద్‌కి వస్తే మహేష్‌బాబు ఇంట్లోనే బసచేసేంతగా.
ఇక తాజాగా ఈమె మహేష్ ఇంటికి వచ్చి నమ్రతా, కూతురు సితారలతో కలిసి ఒక రోజంతా గడిపింది. అంతేకాదు వారితో ఓ మంచి ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఫిల్మ్‌నగర్‌లో మరో వార్త కూడా హల్‌చల్ చేసింది. ప్రస్తుతం కైరా అద్వానీకి తనకున్న పరిచయాలతో పలువురు దర్శకనిర్మాతలు, హీరోలకు చెప్పి రికమండేషన్ చేసి కైరాకి అవకాశాలు ఇప్పించే బాధ్యతని కూడా నమ్రతానే తీసుకుందని అంటున్నారు.
రామ్‌చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో దానయ్య నిర్మిస్తున్న చిత్రంలో కూడా కైరాని యూనిట్‌తో తనకున్న పరిచయాల రీత్యా రికమండ్ చేసింది నమ్రతేనని అంటున్నారు. మొత్తానికి అందం, అభినయం, గ్లామర్‌షో చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేని కైరా త్వరలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ కావడం తథ్యమని అంటున్నారు.