ప్రస్తుతం బాలీవుడ్ భామలను టాలీవుడ్ హీరోలు తెగ దిగుమతి చేసుకుంటున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్స్ కొరత బాగా వుంది. అందుకే ఇక్కడి స్టార్ హీరోలు పరభాషా నటీమణుల వెంట పడుతున్నారు. ఈసారి ముగ్గురు హీరోలు ఒకే టైంలో ఒకే ఒక హీరోయిన్ తో కమిట్ అయ్యారు. మరి మూడు సినిమాలు వరసగా థియేటర్స్ లోకి దిగితే... ఒకే హీరోయిన్ ని ముగ్గురి హీరోల పక్కన చూడాల్సిన పరిస్థితి. అందులో ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ పక్కన ఒకేసారి అదరగొట్టే ఆఫర్స్ పట్టేసింది పూజ హెగ్డే. అందులో ఎన్టీఆర్ - పూజ హెగ్డేల అరవింద సమేత దసరాకి వస్తే... మహేష్ - పూజ హెగ్డే ల సినిమా సంక్రాంతికి వస్తుంది. ఇక ప్రభాస్ సినిమా ఎప్పుడనేది క్లారిటీ లేదు.
అయితే ఇప్పుడు మరో బాలీవుడ్ భామ తెలుగులో బిజీ కాబోతుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. సమ్మోహనం సినిమాలో హీరోయిన్ సమీరాగా అదరగొట్టిన అదితి రావు ఇప్పుడు తెలుగులో భారీ ఆఫర్స్ ని చేజిక్కించుకుంటుందని టాక్. సుధీర్ బాబు పక్కన హీరోయిన్ గా నటించిన అదితి మీద ఇప్పుడు తెలుగు దర్శక నిర్మాతల దృష్టి పడిందంటున్నారు. అందులోను వంశి - మహేష్ ల కలయికలో తెరకెక్కుతోన్న మహేష్ 25 మూవీ లో అదితికి ఒక సెకండ్ హీరోయిన్ ఆఫర్ వచ్చినట్లుగా చెబుతున్నారు. మరి మహేష్ - వంశి పైడిపల్లి కలయికలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజ హెగ్డే ఇప్పటికే మెయిన్ హీరోయిన్ కాగా... ఇప్పుడు మరో హీరోయిన్ గా అదితిని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
మరి వంశి - మహేష్ సినిమాలో ఇప్పటి వరకు మరో హీరోయిన్ ఉందనే సంగతి ఎక్కడా వినబడలేదు. మరి సమ్మోహనం హిట్ తో అదితి కూడా ఈ సినిమాలో ఒక పాత్ర ఇస్తే మంచి క్రేజ్ ఉంటుందని భావించిన వంశి పైడిపల్లి స్క్రిప్ట్ లో ఏమన్నా మార్పులు చేసి ఇలా అదితిని ఇరికించారేమో.. లేకుంటే ఇది రూమర్ కావచ్చు. ఏది ఏమైనా అదితికి మంచి అవకాశాలు రావడం ఖాయమే కానీ.. మహేష్ సినిమాలో ఆఫర్ అనేది ఆధికారికంగా ప్రకటిస్తేనే గాని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే పక్కా స్క్రిప్ట్ తో వంశి - మహేష్ ల సినిమా పట్టాలెక్కేసింది. ఇప్పటికే మహేష్ - పూజ హెగ్డే ల మీద కీలక సన్నివేశాల కోసం చిత్ర బృందం డెహ్రాడూన్ వెళ్ళింది. అక్కడే వంశి - మహేష్ ల రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.