Advertisementt

మహేష్ 25 కి ముగ్గురూ ఒక్కటయ్యారు!

Sat 23rd Jun 2018 11:47 AM
mahesh babu,25th film,dil raju,ashwini dutt,pvp,vamsi paydipalli  మహేష్ 25 కి ముగ్గురూ ఒక్కటయ్యారు!
3 Top Banners Producess Mahesh 25th Film మహేష్ 25 కి ముగ్గురూ ఒక్కటయ్యారు!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కుతున్న వంశీ పైడిపల్లి చిత్రం గత మూడు రోజులు నుండే షూటింగ్ స్టార్ట్ అయింది. డెహ్రడూన్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మహేష్ బాబు ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఎప్పటి నుండో మహేష్ తో ఈ సినిమా చేయాలనీ ఖాళీగా ఉన్నాడు  డైరెక్టర్ వంశీ. మహేష్ కూడా వంశీకి కావాల్సినంత సమయం ఇచ్చి పక్కాగా స్క్రిప్టు రెడీ చేయించాడు.

ఈ చిత్రాన్ని దిల్ రాజు.. అశ్వినీదత్ లాంటి ఇద్దరు అగ్ర నిర్మాతలు నిర్మిస్తున్నారు. అయితే మొదట్లో ఈ సినిమాను నిర్మించే రైట్స్ నావి అని కోర్టులో న్యాయపోరాటం చేసి తిరిగి మళ్లీ ఈ సినిమాలో భాగస్వామి అయ్యాడు పొట్లూరి వరప్రసాద్. ఇప్పుడు ఈ సినిమాకి ముగ్గురు నిర్మాతలు. దిల్ రాజు.. అశ్వినీదత్.. పొట్లూరి వరప్రసాద్. గతంలో వీరి బ్యానర్స్ లో మహేష్ సినిమాలు చేసాడు. 

ఇప్పుడు మహేష్ ల్యాండ్ మార్క్ సినిమాకు ఈ ముగ్గురు బాధ్యత తీసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. వైజయంతీ మూవీస్.. పీవీపీ సినిమా ఈ మూడు బేనర్ల పేర్లు ఒకే పోస్టర్ మీద పడటం అరుదైన విషయమే. మరి ఈ ముగ్గురు నిర్మాతలు ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారో.. ఎంత ఖర్చు పెడతారో.. మహేష్‌తో ఎలాంటి సినిమా తీస్తారో చూద్దాం?

3 Top Banners Producess Mahesh 25th Film:

PVP back on board, makes up with Ashwini Dutt, Dil Raju

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ