నేటిరోజుల్లో మనం తిని, తాగే ప్రతి పదార్ధం కలుషితమవుతోంది. అధిక ఆదాయాలు పొందేందుకు పండ్లు త్వరలో మాగిపోయేలా చేసేందుకు, పెద్ద సైజ్ పండ్లు ఉత్పత్తిని చేయడం కోసం రసాయనాలు వాడుతున్నారు. ఇక ఆవులకు, గేదెలకు ఎక్కువ పాలు ఇచ్చేందుకు దొడ్డిదారిలో ప్రమాదకరమైన ఇంజక్షన్లు చేసి పాల ఉత్పత్తిని పెంచుతున్నారు. పాలను పాలపిండి, నురగ రావడం కోసం డిటర్జెంట్ పౌడర్లను ఉపయోగిస్తున్నారు. కూరగాయలను విషతుల్యమైన రసాయనాలతో పండిస్తున్నారు. ఇలా ప్రతిదీ కల్తీమయం అవుతోంది. టీపొడి, కారం, ఉప్పు, పాలు, పండ్లు, కూరగాయలు ఇలా ప్రతిది ప్రాణాంతకంగా మారుతోంది. నూనె, డాల్డా వంటి వాటిని కూడా చనిపోయిన శరీర అవయవాల నుంచి తయారు చేసే ముఠాలు వెలుస్తున్నాయి.
ఇక విషయానికి వస్తే నిర్మాతగా డి.సురేష్‌బాబుకి ఉన్న గుడ్‌విల్ ఏమిటో అందరికీ తెలుసు. తన తండ్రి రామానాయుడు మరణం తర్వాత ఆయన సినిమాల నిర్మాణం తగ్గించారు. తన సోదరుడు వెంకటేష్ కూడా ఇతర సంస్థల భాగస్వామ్యంలోనే చిత్రాలు నిర్మిస్తున్నారు. కంటెంట్‌పై నమ్మకం ఉన్న చిన్న చిత్రాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆయన 'పెళ్లిచూపులు' దర్శకుడు తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో నలుగురు కొత్త కుర్రాళ్లతో కలిసి 'ఈ నగరానికి ఏమైంది' నిర్మించారు. ఈ చిత్రం 29వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన తనకు హైదరాబాద్ శివార్లలో ఉన్న 30ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా 30ఆవులను పెంచుతున్నారు. వాటికి మంచి తిండి, మంచి నీటిని అందిస్తూ ఏమాత్రం రసాయనాలు, ఇతర విధానాలకు చోటు లేని విధంగా పాల ఉత్పత్తిని చేపట్టారు.
తానే తన ఆవులకు నీరు, తిండి పెడతానని, దీని ద్వారా తాను ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశించడం లేదని, కానీ రసాయనాలతో కూడిన పాలకు స్వచ్చమైన పాలకు ఉన్న తేడాను ప్రజలకు తెలియజేయడమే తన లక్ష్యమని తెలిపారు. లీటర్ పాలని 150 రూపాయలకు అమ్ముతున్నామని తెలిపాడు. ఇక త్వరలో స్వచ్చమైన కూరగాయలు కూడా పండిస్తామని చెప్పిన ఆయనకు ఇటీవల కలుషిత ఆహారం వల్ల అనారోగ్యం రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.