Advertisementt

నాని తో 'జెర్సీ' షేర్ చేసుకుంటుందా?

Sat 23rd Jun 2018 10:00 PM
nani,jersey,keerthy suresh,shruti haasan,malli raava,goutham tinnanuri  నాని తో 'జెర్సీ' షేర్ చేసుకుంటుందా?
Keerthi Suresh In Nani Jersey Movie నాని తో 'జెర్సీ' షేర్ చేసుకుంటుందా?
Advertisement
Ads by CJ

రామ్ సరసన హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంటరైన కీర్తి సురేష్ ఆ సినిమా 'నేను శైలజ' తో సూపర్ హిట్ కొట్టింది. అలాగే వెంటనే నేచురల్ స్టార్ నాని తో 'నేను లోకల్' సినిమా చేసింది కీర్తి సురేష్. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. అప్పటినుండి కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ లా అవకాశాలు ఆమె వెంట పడ్డాయి. ఇక్కడ రెండు హిట్స్ తో ఉన్న కీర్తి సురేష్ కోలీవుడ్ లోను గట్టిగా జెండా పాతేసింది. ఇక టాలీవుడ్ లో ఆమెకి ఎదురుండదు అనుకున్న టైం లో అజ్ఞాతవాసి ఆమెకి పిచ్చెక్కించే ప్లాప్ ఇచ్చింది. ఇక అమ్మడు పని అవుట్ అనుకునేలోపు మళ్ళీ 'మహానటి' తో బంపర్ హిట్ కొట్టింది కీర్తి సురేష్. ఇక టాలీవుడ్ లో బిజీ అవుతుంది అనుకుంటే... అమ్మడు కోలీవుడ్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ టాలీవుడ్ కి ఇవ్వడం లేదనే టాక్ బయలు దేరింది.

అయితే తాజాగా నేచురల్ స్టార్ నాని తో కలిసి కీర్తి సురేష్ మరోసారి జోడి కట్టబోతుంది అనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. ప్రస్తుతం నాని... నాగార్జున తో కలిసి మల్టీస్టారర్ సినిమాతో పాటుగా 'మళ్ళీ రావా' డైరెక్టర్ గౌతమ్ డైరెక్షన్ తో కలిసి 'జెర్సీ' సినిమాలో నటిస్తున్నాడు. అయితే జెర్సీ సినిమాలో నాని పక్కన ఇంకా హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు. అయితే ఈ మధ్యన నాని సరసన శృతి హాసన్ అనే టైటిల్ బాగా హైలెట్ అయ్యింది. తాజాగా శృతి హాసన్ ప్లేస్ లో కీర్తి సురేష్ పేరు వినబడుతుంది. ఎందుకంటే నాని - కీర్తి సురేష్ లు కలిసి నేను లోకల్ సినిమాలో నటించి మంచి హిట్ అందుకున్నారు.

ఇక క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న జెర్సీ కోసం నాని సరసన కీర్తి సురేష్ పేరు ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నాని జెర్సీ సినిమా కోసం క్రికెట్ లో శిక్షణ తీసుకుంటున్నాడని అంటున్నారు. ఇక గౌతమ్ - నాని లు ఫైనల్ గా కీర్తి పేరునే ఫైనల్ చేస్తారనే సమాచారం అందుతుంది. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళంలో విశాల్ తో పందెం కోడి సీక్వెల్, ధనుష్ తో మారి సీక్వెల్, విజయ్ సర్కార్ మూవీలో నటిస్తుంది. ఇక నాని తో కీర్తి సురేష్ ఫైనల్ అయితే.. మహానటి తర్వాత తెలుగులో నాని జెర్సీ మూవీ నే కీర్తి కి మరో టాలీవుడ్ ప్రాజెక్ట్ అవుతుంది.

Keerthi Suresh In Nani Jersey Movie:

Nani Jersey Movie Heroine Confirmed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ