ఈ వయసులోనూ యంగ్ లుక్స్ తో చంపేస్తున్న మహేష్ బాబు.. ఇప్పటికీ.. కాలేజ్ స్టూడెంట్ అంటే ఎవరైనా నమ్మేస్తారు. ఇప్పటికీ నూనూగు మీసాల కుర్రాడిలా.. ఫార్మల్ షర్ట్స్ తో అదరగొట్టే మహేష్ ఇప్పుడు కొత్తగా ట్రై చెయ్యడు. పోకిరి వంటి మాస్ సినిమాలో గెడ్డం పెంచి మాస్ గా కనబడినా. ఆతర్వాత మహేష్ ఎక్కువగా ఒకే లుక్ ని, ఒకే రకమైన డ్రెస్ సెన్స్ ని మెయింటింగ్ చేస్తూ వచ్చాడు. అయితే శ్రీమంతుడులో లుంగీతో అదరగొట్టిన మహేష్ భరత్ అనే నేను లో పంచె కట్టుతో కిర్రెకించాడు. ఇక వంశి పైడిపల్లి దర్శకత్వంలో కెరీర్ లోనే మైలు రాయి అయిన తన 25 వ చిత్రాన్ని చేస్తున్నాడు.
ప్రస్తుతం డెహ్రాడూన్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మహేష్ బాబు అర్ధ భాగం కాలేజి కుర్రాడు గెటప్ లో కనిపిస్తాడట. అందుకే గెడ్డం కాస్త స్టయిలిష్ గా పెంచిన మహేష్ ఈ కాలేజ్ కుర్రాడు గెటప్ కోసం తన రెగ్యులర్ ప్లయిన్ షర్ట్స్ లో కాకుండా చెక్ షర్ట్స్ ఉండేలా కొత్తగా ప్లాన్ చేశారట. మరిప్పుడు ప్లయిన్ అండ్ ఫార్మల్ షర్ట్ లో కనబడే మహేష్ బాబు తాజాగా సమ్మోహనం ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే... చెక్స్ షర్ట్ తో పక్క పాపిడి తీసి జుట్టు పక్కకి దువ్వి .. రఫ్ గా గెడ్డం పెంచి మంచి స్టైలిష్ లుక్ లోకొచ్చేశాడు. మరి ఇప్పడు సినిమాలో కూడా మహేష్ గళ్ళ చొక్కా, రఫ్ గెడ్డం, పక్క పాపిడి ఇలా కొత్తగా ట్రెండ్ చేస్తాడట.
మరి మహేష్ 25 వ చిత్రంపై అటు ట్రేడ్లోనూ ఇటు మహేష్ అభిమానులతోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇక మహేష్ న్యూ లుక్ తో కొత్తగా ట్రెండ్ సెట్ చెయ్యడం.. యూత్ మొత్తం మహేష్ నే ఫాలో అవుతారనే టాక్ మాత్రం చిత్ర బృందం నుండి వినిపిస్తుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక దిల్ రాజు విధిలేని పరిస్థితుల్లో అశ్వినీదత్ తో, పివిపి తో కలిసి ఈ సినిమాని భారీ అంగులతో నిర్మిస్తున్నాడు.