Advertisementt

బిగ్‌బాస్‌: మళ్లీ కామన్‌మ్యానే టార్గెట్‌!

Thu 28th Jun 2018 12:11 PM
bigg boss season 2,common man ganesh,elemination  బిగ్‌బాస్‌: మళ్లీ కామన్‌మ్యానే టార్గెట్‌!
Politics In Big Boss 2 Targeting Common Man బిగ్‌బాస్‌: మళ్లీ కామన్‌మ్యానే టార్గెట్‌!
Advertisement
Ads by CJ

ఏమైనా జరగవచ్చు అని బిగ్‌బాస్‌ ప్రమోషన్‌ స్టార్ట్‌ చేశారు. సెలబ్రిటీలనే కాకుండా సామాన్యులను కూడా బిగ్‌బాస్‌కి ఎంపిక చేశామని సంబరపడ్డారు. లక్షల మందిని ఆడిషన్స్‌ చేసి చివరకు సామాన్యులను నామినేట్‌ చేశారు. అలా రెండు వారాలు గడిచాయో లేదో ఇప్పటికే ఇద్దరు కామన్‌మెన్‌లను ఎలిమినేట్‌ చేశారు. ఇలా ఎలిమినేట్‌ అయిన వారు మిగిలిన కంటెస్టెంట్స్‌ కంటే తక్కువగా ఏమీ కనిపించలేదు. కానీ కత్తివేటు మాత్రం వారి మీదనే పడింది. 

తాజాగా మరో కామన్‌మెన్‌ గణేష్‌ని ఎలిమినేట్‌ చేయడానికి మిగిలిన అందరు నడుం బిగించారు. అదేమని ప్రశ్నిస్తే గణేష్‌ అందరిలోకి చిన్నవాడని, ఆయన హౌస్‌లో ఉండలేకపోతున్నాడని, ఆయన బాధ చూడలేకనే ఎలిమేషన్‌కి నామినేట్‌ చేశామని అంటున్నారు. మరోవైపు గణేష్‌ మాత్రం కిరిటీ నీకేం తెలియదు... నువ్వు కామ్‌గా ఉండు... అంటూ వేధిస్తున్నాడని తెలిపాడు. గణేష్‌ భయపడుతోంది నిజమే గానీ ఆయనను ఆయన ప్రూవ్‌ చేసుకునే అవకాశం ఇప్పటి వరకు  లభించలేదనేది వాస్తవం. 

అందుకే ప్రేక్షకులు గణేష్‌ పట్ల సానుభూతి చూపుతున్నారు. బిగ్‌బాస్‌లో పాల్గొంటున్న వారి ఎత్తులను గణేష్‌ అర్ధం చేసుకోలేకపోతున్నాడు. దాంతో బిగ్‌బాస్‌ నాని కూడా గణేష్‌కి ధైర్యం కల్పించి, ఆయనకు బూస్ట్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మొత్తానికి బిగ్‌బాస్‌లో కామన్‌మెన్‌కి అన్యాయం జరుగుతోందనే చెప్పాలి. 

Politics In Big Boss 2 Targeting Common Man:

Bigg Boss Housemates Again Target Common Man Ganesh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ