Advertisementt

మహేష్ కోసం మరో టాప్ హీరోయిన్..!

Thu 28th Jun 2018 04:34 PM
mahesh 25th film,item song,top heroine,devisri prasad  మహేష్ కోసం మరో టాప్ హీరోయిన్..!
Top Heroine Item Song in Mahesh 25th Film మహేష్ కోసం మరో టాప్ హీరోయిన్..!
Advertisement
Ads by CJ

మహేష్ 25 వ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ముగ్గురు బడా నిర్మాతలు ఈ సినిమాని నిర్మించడం, అల్లరి నరేష్ ఈ సినిమాలో ఒక కీ రోల్ లో నటించడం, గ్లామర్ భామ పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం.. మహేష్ బాబు స్టూడెంట్ గా కొత్త లుక్ లో కనబడడం వెరసి సినిమా మీద భారీ క్రేజ్ ఉంది. తాజాగా ఈ సినిమాలో అల్లరి నరేష్ పూర్ క్యారెక్టర్, మహేష్ రిచ్ క్యారెక్టర్ మాత్రమే కాకుండా అల్ల్లరి నరేష్ క్యారెక్టర్ చనిపోవడంతో.. మహేష్ ఆ చనిపోవడానికి గల కారణాలు వెతకడం.. వంటి కథతో ఈ మహేష్ 25 మూవీని వంశి పైడిపల్లి తెరకెక్కిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమాపై రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వస్తుంది.

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే దర్శకుడితో పాటుగా దేవిశ్రీ మ్యూజిక్ సిట్టింగ్స్ ని ఫినిష్ చేశాడు. అయితే మహేష్ 25 మూవీ ఆల్బమ్ లో దేవిశ్రీ ప్రసాద్ ఒక అదిరిపోయే ఐటెం ట్యూన్ ఇచ్చాడట. మహేష్ సినిమాల్లో ఐటెం సాంగ్ కున్న క్రేజ్ ఎలాంటిదో ఆయన గత చిత్రాలే చెబుతున్నాయి. మరి ఈ రాకింగ్ ఐటెం సాంగ్ ని స్పెషల్ గా కంపోజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తాడని తెలుస్తోంది. మరి దేవిశ్రీ మాములుగా పాట పడుతూనే స్టేజ్ మీద డాన్స్ ఇరగేస్తాడు. ఇక సినిమాలో ఐటెం లో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తాడంటే మాములుగా ఉండదంటున్నారు మహేష్ ఫ్యాన్స్.

ఇక మహేష్ 25 మూవీలోని ఐటెం సాంగ్ లో మహేష్ తో చిందులు వేసేందుకు గాను ఒక బడా హీరోయిన్ ని సెట్ చేసినట్లుగా  వార్తలొస్తున్నాయి. అయితే ఆ టాప్ హీరోయిన్ ఎవరనేది బయటపెట్టడం లేదుగాని... ఆ పాటలో ఐటెం స్టెప్స్ వేసేందుకు గాను భారీగా పారితోషకం నిర్మాతలు ముట్టజెప్పినట్లుగా తెలుస్తుంది. మరి మహేష్ తో చిందులు వేసే ఆ టాప్ హీరోయిన్ ఎవరనే దాని మీద ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటుగా మహేష్ అభిమానుల్లోనూ హాట్ హాట్ చర్చ జరుగుతుంది. 

Top Heroine Item Song in Mahesh 25th Film:

Mahesh 25th Film Item Song  Ready

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ