Advertisementt

'దండుపాళ్యం-4' లో 'బెనర్జీ' పాత్ర ఇదే..!

Sat 30th Jun 2018 06:35 PM
dandupalyam 4,benarjee,benarjee role in dandupalyam 4,dandupalyam  'దండుపాళ్యం-4' లో 'బెనర్జీ' పాత్ర ఇదే..!
Actor Benarjee Role in Dandupalyam 4 Movie 'దండుపాళ్యం-4' లో 'బెనర్జీ' పాత్ర ఇదే..!
Advertisement
Ads by CJ

దండుపాళ్యం-4  విడుదలకు ముస్తాబవుతోంది. దండుపాళ్యం సిరీస్ లో తొలి చిత్రాల విజయాలు దండుపాళ్యం-4  పై ఇటు ప్రేక్షక వర్గాలలోనూ, అటు వ్యాపార వర్గాలలోనూ ఆసక్తిని మరింత పెంచేలా చేశాయి. సుమ రంగనాధన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా వెంకట్ మూవీస్ పతాకంపై కె.టి.నాయక్ దర్శకత్వంలో నిర్మాత వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

-దండును తయారు చేసే నాయకుడి పాత్రలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ 'బెనర్జీ'

ఈ చిత్రంలో దండును తయారు చేసే నాయకుడిగా ప్రధాన పాత్రలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ 'బెనర్జీ' నటిస్తున్నారు. ఇప్పటికే తాను ఈ చిత్రంలో పోషిస్తున్న పాత్ర షూటింగ్ పూర్తయిందని, నటుడిగా తనకిదో వైవిధ్యమైన పాత్ర అని బెనర్జీ తెలిపారు. గత చిత్రాలకన్నా భిన్నంగా 'దండుపాళ్యం-4' రూపొందుతోందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. చిత్రంలో తమ దండు చేసే పోరాటాలు, తన పాత్రతో సహా, ఇతర ప్రధాన పాత్రలు, చిత్రంలోని సన్నివేశాలు, సంఘటనలు, వాతావరణం వాస్తవికతకు అద్దం పడతాయి. మంచి విజన్ వున్న దర్శకుడు కె.టి.నాయక్. నిర్మాత వెంకట్ ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పతాక సన్నివేశాలు ఎంతో ఉత్సుకతను కలిగిస్తాయి. నిస్సందేహంగా ఈ చిత్రంలో తాను పోషిస్తున్న పాత్ర ప్రశంసలను పొందుతుందని ఆయన తెలిపారు. 

ఈ చిత్రానికి, 'దండుపాళ్యం' మొదటి,రెండు,మూడు చిత్రాలకు  ఎలాంటి సంబంధం లేదు. ఈ 'దండుపాళ్యం-4'లో జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ 'దండుపాళ్యం 4' రూపొందుతోంది. ఇందులో  ఏడు మంది గ్యాంగ్ కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటిస్తున్నారు. ఈ చిత్ర కథ కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిందని దర్శకుడు చెప్పారు. 40 మంది గ్యాంగ్ లో ఎనిమిది మంది జైలులో ఉంటారు. వారిని తప్పించడానికి సాగే పథక రచనతోనే ఈ సినిమా రూపొందుతోందని ఆయన వివరించారు. వైవిధ్యమైన  పాత్రలను వెండితెరపై పోషించి తన ప్రతిభను చాటుకున్న సుమ రంగనాథన్ 'దండుపాళ్యం-4'లోనూ విలక్షణమైన పాత్రను పోషిస్తున్నారు. పాత్ర నచ్చడం, కథలోని వైవిధ్యం తనకెంతగానో నచ్చాయని, సుమ రంగనాథన్ చెబుతున్నారు.

-దండుపాళ్యం 4 : ఐదు భాషల్లో విడుదల 

దాదాపు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది, సెప్టెంబర్ లో దండుపాళ్యం-4 ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నిర్మాత వెంకట్ తెలిపారు. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, బెల్గామ్, చిత్రదుర్గ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ సాగింది. ఎన్నో సరికొత్త ప్రదేశాలలో ఈ చిత్రం లోని సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. కెమెరామన్ గిరి ఈ చిత్రానికి ఓ ఎస్సెట్ అన్నారు నిర్మాత. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయాలని నిర్మాత కె.టి. నాయక్ ప్లాన్ చేశారు. కన్నడ, తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయనున్నారు. 

చిత్రంలోని ప్రధాన తారాగణం: సుమ రంగనాధ్, బెనర్జీ, రాక్ లైన్ సుభాకర్, రామ్ దుర్గ, జీవ సిమన్, స్నేహ, రిచా శాస్త్రి , సంజీవ్, విఠల్, అరుణ్ బచ్చన్, రిచా శాస్త్రి, బుల్లెట్ సోము, స్నేహ. 

కెమెరా: ఆర్.గిరి, సంగీతం: ఆనంద్ రాజావిక్రమ్, ఎడిటర్: బాబు.ఎ. శ్రీ వాత్సవ్,ప్రీతి మోహన్, సాహిత్యం: భువనచంద్ర, నృత్యాలు: హరికృష్ణ, నిర్మాణ సంస్థ: వెంకట్ మూవీస్, దర్శకత్వం: కె.టి.నాయక్, నిర్మాత: వెంకట్.

Actor Benarjee Role in Dandupalyam 4 Movie:

Dandupalyam 4 Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ