Advertisementt

మెహ్రీన్ ని భయపెట్టేసిన తాగుబోతు..!!

Sun 01st Jul 2018 11:42 AM
mehreen kaur,train,bitter experience,chennai  మెహ్రీన్ ని భయపెట్టేసిన తాగుబోతు..!!
Mehreen Kaur Gets Shock in Train మెహ్రీన్ ని భయపెట్టేసిన తాగుబోతు..!!
Advertisement
Ads by CJ

ఈ మధ్యన మెహ్రీన్ కి అన్ని బ్యాడ్ లక్సే. మొన్నటికి మొన్న అమెరికాలో ఆమెకి అమెరికా పోలీసుల నుండి చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం చికాగో సెక్స్ రాకెట్ విషయంలో అమెరికా కన్సలేట్.. ఆ విషయాన్నీ తీవ్రంగా పరిగణించింది. అందుకే అక్కడికి వచ్చే హీరోయిన్స్, యాంకర్స్, ఇండస్ట్రీకి సంబందించిన వారిపై నిఘా పెట్టింది. అయితే అనుకోకుండా తల్లి తండ్రులతో కలిసి అమెరికా వెళ్లిన మెహ్రీన్ అక్కడ పోలీసులు నించోబెట్టి అనేక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చెయ్యడం.. ఆతర్వాత ఆమెకి సారి చెప్పేసి అక్కడి నుండి పంపెయ్యడం జరిగింది. అయితే తాజాగా యంగ్ హీరోలందరితో జోడి కడుతున్న మెహ్రీన్ కి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. 

అది కూడా ఒక సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ నుండి చెన్నై కి ట్రైన్ ప్రయాణం చేస్తున్నప్పుడు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాల మీద సినిమాలు చేస్తున్న మెహ్రీన్ కి హైదరాబాద్ కి చెన్నై కి అప్ అండ్ డౌన్ ప్రయాణాలు పరిపాటి అయ్యాయి. ఇక్కడ వరుణ్ తేజ్ తో జోడి కడుతున్న మెహ్రీన్ తమిళంలో టాలీవుడ్ హీరో విజయ్ తో చేస్తున్న నోటా మూవీ షూటింగ్ కోసం అమ్మడు చెన్నైకి ట్రైన్ జర్నీ చేయాల్సి వచ్చింది. అదేమిటి హీరోయిన్ ఫ్లైట్ లో ప్రయాణం చెయ్యకుండా ట్రైన్ లో ప్రయాణం చెయ్యడం ఏమిటి అనుకుంటున్నారా... ఫ్లైట్స్ లో చెన్నై కి టికెట్స్ లేకపోవడంతో.. మెహ్రీన్ కౌర్ కి సదరు నోటా మూవీ నిర్మాత చెన్నై ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ లో టికెట్ బుక్ చేసి మెహ్రీన్ కి ఇచ్చారు.

అయితే మెహ్రీన్ చెన్నై వెళ్లడం కోసం ట్రైన్ లోని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లోకి ఎక్కడంతో.. అప్పటికే ఒక తాగుబోతు ఫుల్ గా తాగేసి మెహ్రీన్ కౌర్ బెర్త్ మీద పడుకోవడంతో.. భయపడిన మెహ్రీన్ చాలా సేపు ట్రైన్ లో నుంచుని ప్రయాణం చేసిందట. అయితే ఈ విషయాన్ని నిర్మాతకి ఫోన్ చేసి చెప్పడంతో.. ఆ నిర్మాత వెంటనే ఒక కారు ఏర్పాటు చేసి మెహ్రీన్ ని వేరే స్టేషన్ లో దిగమని చెప్పి ఆ నిర్మాత అరేంజ్ చేసిన కార్ లోనే చెన్నై కి పంపారట. అయితే ఈ సంఘటనతో మెహ్రీన్ చాలా భయపడిపోయిందని నోటా యూనిట్ చెబుతుంది.

Mehreen Kaur Gets Shock in Train:

Heroine's Bitter Experience In Train  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ