'ఒక్కమనసు'తో వెండితెరకు పరిచయమైన కొణిదెల నాగబాబు కుమార్తె నిహారిక తమిళంతో పాటు తెలుగులో కూడా చిత్రాలు చేస్తోంది. మొదటి చిత్రం సరిగా ఆడకపోయినా కూడా నిరాశచెందకుండా తమిళంతో పాటు తెలుగులో కూడా 'హ్యాపీవెడ్డింగ్' షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. ఈమెకి మెగా డాటర్‌గా బోలెడు ఫ్యాన్స్ అండ ఉంది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ రావడం మాత్రం మెగాభిమానులకు పెద్దగా ఇష్టం లేదనే వాదన కూడా ఉంది. దీనికి కారణం ఆమె నటించిన 'ఒకమనసు' చిత్రం ఓపెనింగ్సే ఉదాహరణగా చెప్పాలి. మెగాభిమానులు ప్రోత్సహించి బాగానే ఆడగల సత్తా ఉన్నా కూడా ఈ చిత్రం ఆడకపోవడానికి మెగా వీరాభిమానులే కారణం.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె సుమంత్ అశ్విన్ హీరోగా 'హ్యాపీవెడ్డింగ్' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం సుమంత్ అశ్విన్‌కే గాక నిహారికకు కూడా ఎంతో ముఖ్యం. తాజాగా ఈచిత్రం ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. నేడు యూట్యూబ్‌లు సాగుతున్న ధోరణిపై సెటైరికల్‌గా ఈ వీడియో ఆకట్టుకుంటోంది. నిహారిక షూటింగ్ ముగించుకుని వెళ్తుంటే ఓ వ్యక్తి వచ్చి తాను యూట్యూబ్ నుంచి వచ్చానని, సోషల్‌మీడియా అంతా మీ వెడ్డింగ్ గురించే చర్చ సాగుతోందని అంటాడు. ఈ విషయంపై మాట్లాడాలని ఆమెని కోరితే వెంటనే ఆమె 'ఎందుకయ్యా..నా పెళ్లి గురించి మీకెందుకు? ఎవరిని చేసుకుంటుంది?ఎప్పుడు చేసుకుంటుంది? తెలిస్తే షాక్ అవుతారు షేక్ అవుతారు అని రాస్తారు. మీ థంబ్ నైల్స్ కోసం నన్ను వాడుకుంటారా?' అని ఫైర్ అవుతుంది.
వెంటనే ఆ విలేకరి 'వెడ్డింగ్ అంటే మీ వెడ్డింగ్ గురించి కాదు.. మీరు నటిస్తున్న హ్యాపీవెడ్డింగ్ గురించి' అంటాడు. దాంతో ఈమె 'సారీ..సారీ..హ్యాపీ వెడ్డింగ్ ట్రైలర్‌ని 30వ తేదీన రిలీజ్ చేస్తాం.. అందులోనే సినిమా ఎప్పుడు విడుదల అయ్యేది చెబుతామని అంటుంది. ఇక గతంలో నిహారికకు సాయిధరమ్‌తేజ్‌తో పెళ్లి అని, ప్రభాస్ చేసుకోనున్నాడని, నాగశౌర్యతో ఎఫైర్ ఉందని యూట్యూబ్‌లలో నానా వార్తలు రావడంతోనే ఇలా వాటిపై సెటైరు విసిరినట్లుగా కనిపిస్తోంది. కాగా ఈ ట్రైలర్ 30వ తేదీ ఉదయం 10గంటల 35 నిమిషాలకు ఈ ట్రైలర్ ని విడుదల చేశారు.