తాజాగా రణబీర్‌కపూర్ హీరోగా రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో వచ్చిన 'సంజు' మూవీ అద్భుతమైన టాక్‌ని తెచ్చుకుని రణబీర్‌కపూర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా, ఈయన కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్‌ని సాధిస్తున్న చిత్రంగా నిలుస్తోంది. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా చూసేయాలని సినీ ప్రముఖులు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ సంజయ్‌దత్ బయోపిక్‌లో టైటిల్ పాత్రను పోషించిన రణబీర్‌కపూర్ నటనపై కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ చిత్రం గురించి తాజాగా రణబీర్ గర్ల్‌ఫ్రెండ్ అలియా భట్ కూడా స్పందించింది. ఆమె మాట్లాడుతూ, నేను రాజ్‌కుమార్ గారికి వీరాభిమానిని. ఆయన చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలవడం కామన్ అయిపోయింది. 'సంజు' విషయానికి వస్తే గత చాలాకాలంగా రాజ్‌కుమార్ గారు తీసిన అద్భుత చిత్రాలలో దీనిదే మొదటి స్థానమని ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమా ద్వారా ఆయన స్టామినా ఏమిటో మరోసారి ప్రూవ్ అయింది... అంటూ చెప్పుకొచ్చింది.
పనిలో పనిగా తన స్నేహితుడు రణబీర్‌కపూర్‌పై కూడా ప్రశంసల జల్లు కురిపించింది. 'సంజు' పాత్రలో రణబీర్ జీవించేశాడు. నాఫేవరేట్ టాప్10 చిత్రాలలో 'సంజు'కి మొదటి స్థానం ఇస్తాను. విక్కీకౌశల్, పరేష్‌జీ, అనుష్కశర్మ, సోనమ్‌కపూర్..ఇలా ప్రతి ఒక్కరు తమ పాత్రలకు జీవం పోశారు. ఇదో అద్భుత కళాఖండం అని అలియా కితాబునిచ్చింది. అలియా మాటల్లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని చిత్రం చూసిన వారు ముక్తకంఠంతో చెబుతున్నారు.