కోలీవుడ్ స్టార్ హీరో మంచి జోరు చూపిస్తున్నాడు. వరుస విజయాలతో కాకపోయినా... ఒకటి హిట్టు మరొకటి ఫట్టు అన్నట్టుగా ఉన్న సూర్య కెరీర్ ఇప్పుడు మాములుగా లేదు. వరసబెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. మిగతాహీరోలకు గట్టి పోటీనిస్తున్నాడు. సింగం సీరీస్ తో అదరగొట్టిన సూర్య ప్రస్తుతం సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో ‘ఎన్జీకే’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా దీవాళి కానుకగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాతో పాటుగా సూర్య, కేవీ ఆనంద్ డైరెక్షన్లో మరో సినిమాని మొదలెట్టేసాడు. కేవీ ఆనంద్ డైరెక్షన్లో సూర్య వీడోక్కడే, బ్రదర్స్ వంటి సినిమాలు చేసాడు.
కేవీ ఆనంద్ - సూర్య కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ప్రస్తుతం లండన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇకపోతే సూర్య ఈ రెండు సినిమాలనే కాకుండా ఇప్పుడు మరో సినిమాని కమిట్ అయినట్లుగా.. అందునా మొదటిసారి ఒక లేడీ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. 'సాలా ఖడూస్' వంటి హిట్ పిక్చర్ తీసిన సుధా కొంగర తో సూర్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట. మొదట్లో చిన్న చిన్న సినిమాలు తీసిన సుధా కొంగర కి 'సాలా ఖడూస్' గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఇక ఆ సినిమాని తెలుగులో వెంకటేష్ హీరోగా 'గురు' సినిమాగా మలిచి హిట్ కొట్టింది.
అయితే ఆ సినిమా చేసిన ఏడాదిన్నరకు మరో కథను డెవలెప్ చేసి పూర్తి స్క్రిప్ట్ తో సుధా కొంగర కోలీవుడ్ హీరోను కలిసింది. అయితే సుధా కొంగర చెప్పిన స్టోరీ లైన్ కి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కథ పీరియడ్ డ్రామాగా ఉండబోతుందని.. అందుకే సూర్య కూడా వెంటనే ఓకే చెప్పేసాడని తెలుస్తుంది. ఇక సుధా కొంగర- సూర్య కాంబోలో తెరకెక్కబోయే ఈ సినిమా ఈ ఏడాది చివరిలో మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.