Advertisementt

ఈ ప్రొడ్యూసర్ మెగా హీరోలను వదలంటున్నాడు!!

Mon 02nd Jul 2018 10:13 PM
ks rama rao,sai dharam tej,chiranjeevi,ram charan,tej i love you  ఈ ప్రొడ్యూసర్ మెగా హీరోలను వదలంటున్నాడు!!
KS Ramarao about Chiranjeevi ఈ ప్రొడ్యూసర్ మెగా హీరోలను వదలంటున్నాడు!!
Advertisement
Ads by CJ

ఒక్కప్పుడు నిర్మాత కె.ఎస్.రామారావు.. చిరంజీవి కలిసి చాలా సినిమాలు చేసారు. దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  లాస్ట్ గా వీరి కాంబినేషన్ లో  ‘స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’ వచ్చి ప్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు.

లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ తో ‘తేజ్ ఐ లవ్యూ’ సినిమాతో మెగా కాంపౌండ్లోకి వచ్చాడు రామారావు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. రామారావు గారి బ్యానర్ లో రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా ఉంటుందని తెలిపాడు. అయితే చరణ్‌తోనే కాక చిరంజీవితో కూడా తాను సినిమా నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు రామారావు తెలిపాడు.

చిరంజీవితో సినిమా చేసే ప్రయత్నం కచ్చితంగా చేస్తానని చెప్పారు రామారావు. తానూ ఇప్పటిదాకా 45 సినిమాలు నిర్మించానని.. అందులో నాలుగైదు మాత్రమే ఫ్లాప్ అయ్యానని.. తనకంటూ ఒక అభిరుచి ఉందని రామారావు చెప్పారు. ‘తేజ్ ఐ లవ్యూ’ కచ్చితంగా హిట్ అవుతుందని భరోసా ఇచ్చారు. సినిమాలో సీన్స్ నచ్చకపోతే డైరెక్టర్ తో చెప్పి ఆ సీన్స్ మార్పించే సామర్థ్యం ఉందని రామారావు అన్నారు.

KS Ramarao about Chiranjeevi:

Star Producer Mega Bonding With Chiru

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ