విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టినప్పట్నుంచి జగపతిబాబు సుడి మామూలుగా లేదు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సూపర్ స్టైలిష్ విలన్ గా ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. ఇప్పుడు ప్రతి స్టార్ హీరో సినిమాకి విలన్ గా ఫస్ట్ ఛాయిస్ జగపతిబాబే. అందుకు కారణం కూడా లేకపోలేదు.. 'లెజండ్'కు ముందు వరకూ కాస్త బలమైన లేదా స్టైలిష్ విలన్ కావాలంటే హిందీ లేదా మరాఠీ నటులవైపు చూసే తెలుగు దర్శకులకు దొరికిన మంచు ముత్యం జగపతిబాబు. అందుకే ఆయన విలన్ గా కెరీర్ ను కొత్త కోణంలో మొదలుపెట్టినప్పట్నుంచి అగ్ర దర్శకులందరూ ఆయన కోసమే లేదా ఆయన్ను దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు.
తాజాగా మరో అద్భుతమైన పాత్ర జగపతిబాబును వెతుక్కుంటూ వచ్చింది. సమైఖ్యాంధ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'యాత్ర'లో మమ్ముట్టి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిగా టైటిల్ పాత్ర పోహిస్తుండగా.. ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్రైన రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజా రెడ్డిగా జగపతిబాబు నటించనున్నారు. ఈమేరకు ఆల్రెడీ స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగిపోయాయి. అఫీషియల్ గా ప్రెస్ నోట్ రావడం మినహా మిగతా ప్రొసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలనుకొంటున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది.