సోషల్ మీడియా ద్వారా రైజింగ్‌స్టార్‌గా, కామెడీ నటునిగా విపరీతమైన క్రేజ్‌ని సంపూర్ణేష్‌బాబు సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ సీజన్1లో మొదట ఆయనే ఆ షోకి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఇక ఈయన హీరోగా నటించిన 'హృదయకాలేయం' చిత్రం ఓ వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. 'హృదయకాలేయం' దర్శకుడు, స్టీవెన్ స్పీల్‌బర్గ్ నుంచి స్టీవెన్‌ని, దర్శకుడు శంకర్ నుంచి శంకర్‌ని తీసుకుని స్టీవెన్ శంకర్‌గా మారిన ఆయన సంపూర్ణేష్‌బాబు నటిస్తున్న 'కొబ్బరిమట్ట' చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ప్రారంభమై రెండేళ్లు కావస్తోంది.
మోహన్‌బాబు 'పెదరాయుడు' అవతారంలో 2016లో విడుదలైన 'కొబ్బరిమట్ట' టీజర్ లో.. భార్యల గొప్పతనం గురించి పేరడీగా సింగిల్‌టేక్‌లో సంపూ చెప్పిన డైలాగ్ అదుర్స్ అనిపించుకుంది. ఈ చిత్రం తాజాగా విడుదలకు సిద్దమైంది. ప్రతి బ్యాచ్‌లర్ కొంపలో మందు సిట్టింగ్‌కి బెస్ట్‌స్టఫ్ 'కొబ్బరిమట్ట' కాబోతోంది. కొత్తరకమైన, అదోరకమైన సినిమా చూసి మీరునవ్వుకోబోతున్నారు. ఇది ఏడాదిన్నర కష్టం. కష్టం అనేది చిన్నమాట. ముగ్గురు భార్యలున్న మనసున్న ఓ భర్తకథ అని సంపూ తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన నిర్మాత సాయిరాజేష్ చేసిన ట్వీట్స్‌ని రీట్వీట్ చేశాడు.