'బాహుబలి' చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా మొత్తం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో వేరేగా చెప్పనవసరం లేదు. ఆ క్రేజ్ తోనే ప్రభాస్.. రానా తమ ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చేస్తున్నాడు. ఈ చిత్రం అవ్వగానే రాధాకృష్ణ డైరెక్షన్ లో ఓ మాస్ ఎంటర్ టైనర్ ను చేయనున్నాడు.
ఇక దగ్గుబాటి రానా అయితే రెండు మూడు సినిమాలతో పాటు గుణశేఖర్ తో ఓ సినిమా చేయనున్నాడు. అయితే తాజాగా ఫిలింనగర్ సమాచారం ప్రకారం.. రానా, ప్రభాస్ కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతున్నట్టు టాక్. 'సంతోషం','మిస్టర్ పర్ఫెక్ట్' తో తనకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ దశరథ్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం దశరథ్ కథను తయారు చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో .. ఎప్పుడు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందో చూడాలి. ఒకవేళ ఓకే అయితే మాత్రం.. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ మల్టీ స్టార్రర్ అయితే ఆ లిస్ట్ లోకి ఈ సినిమా కూడా చేరడం ఖాయం.