ఇటీవల కమల్‌హాసన్ హిందువులపై చేసిన వ్యాఖ్యలు, ఆ వెంటనే కావాలని కత్తి మహేష్ పనిగట్టుకుని శ్రీరాముడు, రామాయణంపై చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ప్రస్తుతం అందరిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ వ్యక్తిగత ప్రచారం కోసం కోట్లాది మంది హిందువులు పవిత్రంగా భావించే రామాయణం, శ్రీరాముడు, వంటి విషయాలలో కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు నిజంగానే మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. అసలు ప్రతి ఒక్కరు తమ మేధావితనం చూపించడానికి, మైనార్టీ ఓటు బ్యాంకు కోసం హిందువులను టార్గెట్ చేస్తూ ఉండటం శోచనీయం. అదేమంటే దళితకార్డుని చూపించి వీరు ఇతరులను భయపెడుతున్నారు. మన చట్టాలలో కూడా కొన్ని లోపాలు వారికి సహకరిస్తున్నాయి. మతం మార్చుకున్న అన్నికులాల వారు బయటికి మాత్రం రెడ్డి, చౌదరి, శాస్త్రి వంటివి పెట్టుకుని ఓటు రాజకీయాలు చేస్తూనే మతం బయటకు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు రిజర్వేషన్ల కోసం, మైనార్టీ కార్డు ద్వారా ఆర్ధికలబ్ది పొందడం కోసం తాము క్రైస్తవుల మని చెప్పుకుంటున్నారు. ఇలా ఒకే వ్యక్తికి రెండు మతాలు ఎలా ఉంటాయో అర్ధం కాని పరిస్థితి.
ఇక విషయానికి వస్తే మెగా ఫ్యామిలీకి కత్తిమహేష్‌కి మధ్య ఉన్న వైరం అందరికీ తెలిసిందే. మరి దానిని మనసులో పెట్టుకుని మాట్లాడాడా? లేక నిజంగానే తన అభిప్రాయాలను వెలిబుచ్చాడో గానీ మెగాబ్రదర్ నాగబాబు దీనిపై ఘాటుగా స్పందించాడు. హిందువులు ఎంతో భక్తిభావంతో కొలిచే శ్రీరాముడిని ధూషించిన కత్తి మహేష్‌పై తీవ్ర చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ మతాన్నైనా సరే.. వారు ఎవరైనా సరే కించపరుస్తూ మాట్లాడటం తప్పు. రామాయణం అనేది పుస్తకం కాదు. కోట్లాదిమంది ఆరాధించే ఓ భగవంతుని చరిత్ర. ముస్లింకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ ఎలాంటివో హిందువులకు రామాయణం, భాగవతం వంటివి అలాంటివే. హిందు మతం, దేవుళ్లపై ఓ పద్దతి ప్రకారం దాడి జరుగుతోంది. నాస్తికత్వం పేరుతో హిందువుల మనోభావాలు కించపరిచే వారు శిక్ష అనుభవిస్తారు. మత విశ్వాసాలను కించపరిచే విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం.
కత్తిమహేష్ వ్యాఖ్యలపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రజలే చట్టాన్నితమ చేతుల్లోకి తీసుకుంటారని హెచ్చరించాడు. ఇక కత్తిమహేష్ వ్యాఖ్యలపై పలు మఠాధిపతులు, స్వామీజీలు కూడా కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఉంది. అదే వేరే మతాలను కించపరిస్తే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకాలం మౌనంగా ప్రేక్షక పాత్రలను పోషిస్తూ ఉండేవా? అనే అనుమానం ప్రతి హిందువును దహించి వేస్తోందని చెప్పాలి.