Advertisementt

సూర్పణక గా ఆ టాప్ హీరోయిన్..!!

Fri 06th Jul 2018 07:30 PM
kajal agarwal,top heroine,surpanakha,role  సూర్పణక గా ఆ టాప్ హీరోయిన్..!!
Kajal Agarwal will Play the Role of Surpanakha సూర్పణక గా ఆ టాప్ హీరోయిన్..!!
Advertisement
Ads by CJ

సౌత్ లో గత కొన్నేళ్ల నుండి చెలరేగిపోయిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అటు సీనియర్ హీరోస్ తోనూ.. ఇటు యంగ్ హీరోస్ తోనూ సమానంగా సినిమాలు చేసి తన కెరీర్ కు ఏ డోకా లేకుండా చూసుకుంది. కొంతమంది దర్శకులు అయితే కాజల్ ని కోరి మరీ సినిమాలో తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 50కి పైగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఎన్నో డిఫరెంట్ సినిమాలు చేసింది.

లేటెస్ట్ గా ఈమె ఒక పూర్తి పౌరాణిక చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు భార్గవ్ దర్శకత్వంలో రావణుడి సోదరి సూర్పణక పాత్రలో కాజల్ నటించడానికి రెడీ అవుతుందట. ఇది భారీ బడ్జెట్ తో ఫుల్ సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట.

సూర్పణక పాత్ర అంటే రాముడిపై మనసు పారేసుకునే పాత్ర. ఒకరకంగా చెప్పాలంటే రామ రావణ యుద్ధం మొదలవ్వడానికి మొదటి కారకురాలు ఆమె. ఆ పాత్రకు సంబంధించి డిజైన్ ను సెట్ చేసుకొని కాజల్ ని ఊహించుకొని స్కెచెస్ వేశారట. అది కాజల్ కి బాగా నచ్చడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇంకా తెలియాల్సిఉంది.

Kajal Agarwal will Play the Role of Surpanakha:

Kajal Agarwal Green Signal to Surpanakha Role

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ