గోపీచంద్ - మెహ్రీన్ కౌర్ జంటగా కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో తెరకెక్కిన 'పంతం' సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే గత వారం సరైన సినిమాలేవీ థియేటర్స్ లో లేకపోవడంతో గోపీచంద్ 'పంతం' సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. టాక్ తో సంబంధం లేకుండా గోపీచంద్ 'పంతం' సినిమా కలెక్షన్స్ రాబట్టింది. యావరేజ్ టాక్ అంటే.. కలెక్షన్స్ కూడా యావరేజ్ గానే ఉంటాయనుకున్నారు. కానీ పంతం కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా గోపీచంద్ పంతం సినిమా 3.22 కోట్లు షేర్ తో 5.2 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే గోపీచంద్ సినిమాకి ఇలా మంచి ఓపెనింగ్స్ రావడానికి మెయిన్ కారణం ఆ సినిమాకి చేపట్టిన ప్రమోషన్స్ అనే మాట గట్టిగా వినబడుతుంది. మొదటిరోజు కలెక్షన్స్ ఇలా వున్నాయి.
ఏరియా ఫస్ట్ డే షేర్
నైజాం - 1,12,00,000
సీడెడ్ - 47,00,000
నెల్లూరు - 12,00,000
గుంటూరు - 33,00,000
కృష్ణ - 15,77,125
వెస్ట్ గోదావరి - 16,35,976
ఈస్ట్ గోదావరి - 20,92,000
ఉత్తరాంధ్ర - 34,79,085
ఏపీ & టీస్ షేర్ - 2.92 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా - 20,00,000
ఓవర్సీస్ - 10,00,000
వరల్డ్ వైడ్ షేర్ 3.22 కోట్లు, గ్రాస్ 5.2 కోట్లు