Advertisementt

చిరు, మహేష్ ల మధ్య పోటీ తప్పదా..?

Sun 08th Jul 2018 11:04 PM
chiranjeevi,mahesh babu,sye raa narasimha reddy,mahesh 25th film  చిరు, మహేష్ ల మధ్య పోటీ తప్పదా..?
Clashes Between Chiranjeevi and Mahesh Babu Movies చిరు, మహేష్ ల మధ్య పోటీ తప్పదా..?
Advertisement
Ads by CJ

మెగాస్టార్ కెరీర్ లోనే గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కుతున్న చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. దాదాపు 200 కోట్లు పెట్టి ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. సీన్ టూ సీన్ ప్రేక్షకులని కట్టిపడేసేలా చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. మొదటి నుండి ఈ సినిమాను 2019 సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ భారీ విజువ‌ల్ గ్రాఫిక్స్ వ‌ల్ల స‌మ్మ‌ర్ కి రిలీజ్ ఉంటుంద‌ని చెబుతున్నారు.

అంటే మార్చి చివరి వారంలో సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కానీ అదే టైంలో మహేష్ - వంశీ పైడిపల్లి సినిమా వస్తుంది. 'సైరా' మార్చి 25న వస్తుంటే కరెక్ట్ గా పది రోజులు గ్యాప్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నాడు. ఒకవేళ ఇదే జరిగితే ఇరు సినిమాల‌కు ఇది ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మేన‌ని ట్రేడ్‌లో ప్ర‌చారం సాగుతోంది.

రెండు సినిమాలకు కనీసం రెండు వారాలు గ్యాప్ ఉండాలని లేకపోతే కలెక్షన్స్ కు మరియు థియేటర్స్ పై ఎఫెక్ట్ పడుతుందని ట్రేడ్ చెబుతున్నారు. మరి ఇరు సినిమాల నిర్మాతలు ఏం ఆలోచిస్తారో చూడాలి. చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆగ‌స్టు 22న 'సైరా -న‌ర‌సింహారెడ్డి' ఫస్ట్‌లుక్ టీజ‌ర్ రిలీజ్ చేస్తార‌ని చెబుతున్నారు. 

Clashes Between Chiranjeevi and Mahesh Babu Movies :

Sye Raa Narasimha Reddy Vs Mahesh 25th 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ