'మహానటి' సినిమాతో కీర్తి సురేష్ ఎక్కడికో వెళ్లిపోయింది. దాంతో ఆమెకు అవకాశాలు మీద అవకాశాలు వచ్చాయి పడుతున్నాయి. తమిళ్ లో ప్రస్తుతం విశాల్, సూర్య, విక్రమ్ సినిమాలతో బిజీ బిజీ గా వుంది. దాంతో ఆమె తెలుగులో ఇప్పటిలో యాక్ట్ చేయడం కష్టమే అని చెబుతోంది. తాజా సమాచారం ప్రకారం తమిళ్ లో వెంకట్ ప్రభు చెప్పిన కథ నచ్చడంతో ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట.
అయితే ఆ తర్వాత అందులో హీరో పేరు తెలుసుకుని ఆలోచనలో పడిందని టాక్. తమిళ్ లో ఏదొక వివాదం లేకుండా ఉండలేని శింబుకి జోడి అన్నందుకే ఈ డైలమా అట. హీరోయిన్స్ తో మనోడు కొంచం తుంటరిగా బిహేవ్ చేస్తూ అండ్ ప్రేమ ముగ్గులో దింపటంలో శింబు ఎంత ఎక్స్ పర్టో కోలీవుడ్ లో కథనాలు వస్తూనే ఉంటాయి. అందుకే కీర్తి ఆలోచనలో పడినట్టు సమాచారం.
అయితే రాజమౌళి మల్టీ స్టారర్ లో ఎన్టీఆర్ పక్కన చేస్తుందనే టాక్ ఉంది కానీ ఆమెకు డేట్స్ ప్రాబ్లెమ్ ఉండటంతో ఏ విషయము చెప్పడం లేదని వినికిడి. మొత్తానికి కీర్తి సురేష్ కి ఇలా వరస ఆఫర్స్ రావడం మాములు విషయం కాదు. ఇక మహానటి సినిమా రీసెంట్ గా యాభై రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసందే.