టాలీవుడ్ లో హీరోయిన్స్ అందంగా, నైస్ గా, సన్నగా.. లైట్ గా, హాట్ హాట్ గా కనిపిస్తేనే తెలుగు ప్రేక్షకులు లైక్ చేస్తారు. అదే కొద్దిగా బొద్దుగా మారాక... ఇక ఆమెకి ప్రేక్షకుల నుండి తిరస్కరణ తప్పదు. దర్శక నిర్మాతలు కూడా ఆమెని మరో సినిమాలో తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అందుకే హీరోయిన్స్ ఎప్పుడూ వర్కౌట్స్ అంటూ జిమ్స్ లో కష్ట పడుతూ కొవ్వు కరిగించుకుంటుంటారు. గత కొంతకాలంగా మీడియం హీరోల సరసన నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న రాశి ఖన్నా కి తన బొద్దు తనం వలన అవకాశాలు తగ్గాయి. బెంగాల్ టైగర్, సుప్రీం, జై లవ కుశ సినిమాల్లో బాగా బొద్దుగా కనిపించడంతో రాశి ఖన్నా అవకాశాలు తగ్గాయి. అందుకే అమ్మడు అవకాశాలు ఎందుకు తగ్గాయి బాగా గమనించినట్టుగా ఉంది. ఇక తన కొవ్వు కరిగించుకోవడానికి అమ్మడు ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టింది. మరి బాగా జిమ్ లో కష్టపడి ఒళ్ళు కరిగించినందుకు గాను రాశి ఖన్నా కి మంచి ఫలితాలే దక్కాయి. అలా సన్నబడిందో లేదో ఇలా వరుణ్ తేజ్ పక్కన తొలిప్రేమ ఛాన్స్ కొట్టేసి హిట్ కొట్టేసింది. ఆ వెంటనే నితిన్ తో శ్రీనివాస కళ్యాణం ఛాన్స్ ఇలా వీరలెవల్లో దూసుకుపోతుంది.
ఇక తాజాగా రాశిఖన్నా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి చూస్తుంటే అబ్బా రాశి అందాలు ఎంతందంగా ఉన్నాయో అంటారు. పైన చూస్తున్న ఫోటో లో రాశి ఖన్నా ని చూస్తుంటే మత్తెక్కిన్చేస్తుంది. కర్లీ హెయిర్ తో కత్తిలాంటి చూపుతో... ఆమె త్రీ ఫోర్త్ ఫోటో చూస్తుంటే మాత్రం యువత గుండెలు జారిపోవడం మాత్రం ఖాయం. అంతలాంటి కొంటె చూపుతో రాశి ఖన్నాని చూస్తుంటే మాత్రం ఈసారి స్టార్ హీరోలు కూడా అవకాశాలిస్తారనిపిస్తుంది. జులపాల డ్రెస్ వేసుకుని... డార్క్ కలర్ లిప్ స్టిక్ తో రాశిని చూస్తుంటే మాత్రం ఈసారి అమ్మడుకి అవకాశాలు ఎవరూ ఆపలేరనిపిస్తుంది. ఇక రాశి ఖన్నా - నితిన్ ల శ్రీనివాస కళ్యాణం ఆగష్టు 9 న విడుదలకు సిద్ధమౌతోంది.