Advertisementt

'సాక్ష్యం'కు షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్..!!

Wed 11th Jul 2018 09:42 PM
sakshyam,bellamkonda srinivas,pre release business,sriwass  'సాక్ష్యం'కు షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్..!!
Sakshyam Movie Pre Release Business Details 'సాక్ష్యం'కు షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్..!!
Advertisement
Ads by CJ

బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ లో మూడు సినిమాలు చేయగా ఆ మూడు సినిమాలు భారీగా తెరకెక్కించిన చిత్రాలే. అందులో రెండు సినిమాలు అయితే ఏకంగా 30 కోట్ల పైమాటే. హిట్స్.. ప్లాప్స్ తో సంబంధం లేకుండా తనపై భారీ లెవెల్ లో ఇన్వెస్ట్ చేసి సినిమాలు తీయడం విషయంలో మేకర్స్ ఏ మాత్రం వెనక్కు తగ్గడంలేదు. తాజాగా శ్రీనివాస్ నటించిన 'సాక్ష్యం' సినిమా ఈ నెల 27న రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమా ఏకంగా 40 కోట్లు బిజినెస్ చేసిందని టాక్. ట్రేడ్ లెక్కలు ప్రకారం.. నైజాంకు 7 కోట్లు.. సీడెడ్ కు 5 కోట్లు..ఆంధ్ర మొత్తం కలిపి 15 కోట్లకు అభిషేక్ సంస్థ అమ్మేసిందనే వార్తలు వస్తున్నాయి. శాటిలైట్ ప్లస్ డిజిటల్ మీద ఇప్పటికే 10 కోట్ల వరకు వచ్చాయంట. ఓ ఫాంటసీ కథ ఇంతలా బిజినెస్ జరగడం.. మరియు శ్రీనివాస్ పై ఇంత పెట్టడం అంటే మాములు విషయం కాదు.

పూజా హెగ్డే గ్లామర్, గ్రాఫిక్ సన్నివేశాలు, సినిమా టేకింగ్ ఈ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశాలు వున్నాయి. 'సాక్ష్యం' హిట్ అందుకోవాలంటే...కేవలం షేర్ మాత్రమే 30 కోట్లు అయినా రావాలి. ఓపెనింగ్స్ బాగా వస్తేనే కానీ అంత షేర్ కలెక్ట్ చేయలేదు ఈ సినిమా. దానికి తోడు మొదటి రోజు వచ్చే టాక్ ని బట్టే జాతకం ఆధారపడి ఉంటుంది. కంటెంట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో చిత్ర యూనిట్ వుంది.

Sakshyam Movie Pre Release Business Details:

Shocking Pre Release Business To Saakshyam Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ