Advertisementt

ప్రణీత ఫస్ట్ డెలివరీ ఎంత టెన్షన్‌ పెట్టిందంటే: ఎన్టీఆర్

Sun 15th Jul 2018 01:56 PM
jr ntr,celekt mobile,abhay ram,launch  ప్రణీత ఫస్ట్ డెలివరీ ఎంత టెన్షన్‌ పెట్టిందంటే: ఎన్టీఆర్
JR NTR Speech about His First MOBILE Phone at Celekt Mobiles Launch ప్రణీత ఫస్ట్ డెలివరీ ఎంత టెన్షన్‌ పెట్టిందంటే: ఎన్టీఆర్
Advertisement
Ads by CJ

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కూడా తను టెన్షన్‌ పడిన సంఘటనను తాజాగా చెప్పుకొచ్చాడు. నేను 'రభస' షూటింగ్‌ కోసం స్విట్జర్లాండ్‌లో ఉన్నాను. నా భార్యతో ఫోన్‌లో మాట్లాడా. ఆమె డెలివరీ దగ్గర పడింది. ఏదో తేడా అనిపించింది. వెంటనే ఫోన్‌ చేసి 'పాపను కనేయకు, నేను వచ్చేవరకు ఆగు' అని చెప్పాను. ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే ఫోన్‌ చేశాను. ఆ సమయంలో నా భార్యకి తోడుగా మా అమ్మ ఉంది. అమ్మ నాకు విషయం చెప్పింది. ఎంతో టెన్షన్‌ పడ్డాను. అమ్మ ఫోన్‌ చేసి విషయం చెప్పింది. నా గుండె ఆగిపోయింది. శరీరం చల్లగా అయిపోయింది. ఫోన్‌ తీయగానే ఎప్పుడు రావాలని అడిగాను. వీలైనంత త్వరగా రావాలని డాక్టర్‌ చెప్పారు అని అమ్మ చెప్పింది. వెంటనే హాస్పిటల్‌కి చేరుకున్నాను. నేను వెళ్లిన తర్వాతే డెలివరీ అయి బాబు పుట్టాడు.

నాకు ఏ ఫోన్‌ బ్రాండ్‌ అయినా సరే సౌకర్యంగా ఉంటే చాలు అని భావిస్తాను. ఎన్టీఆర్‌ అంటే అదో ఎనర్జీ, వైబ్రేషన్‌ వస్తుంది అంటూ ఉంటారు. అందరు అలా చెబుతూ ఉంటే ఆనందంగా ఉంటుంది. కొంచెం పొంగుతున్నాను. ఇక నిజం చెప్పాలంటే అదేమీ నిజంకాదు. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు వేరుగా ఉంటుంది. నా పరిస్థితి అందరికీ రాదు. ఇతరుల పరిస్థితి నాకు రాదు. వ్యక్తిగత కారణాలే దీనికి కారణం అని భావిస్తాను. నేను పాజిటివ్‌గా ఉంటా. 'నిన్ను చూడాలని' సమయంలో ఉన్నట్లు ఇప్పుడు లేను. పెళ్లి, అద్భుతమైన భార్య, పిల్లలు, స్నేహితులు, అభిమానులు.. ఇలా అందరి వల్లా నేను ఎనర్జిటిక్‌గా ఉంటాను.

అభయ్‌రామ్‌ మొదటి సారిగా మా అమ్మగారి ఐఫోన్‌ వాడాడు. ఇక నాకు అభయ్‌రామ్‌కి రిమోట్‌కోసం యుద్దం జరుగుతుంది. వాడికి కార్టూన్స్‌ అంటే ఇష్టం. 'అదుర్స్‌'లాంటి చిత్రం కావాలని అందరు కోరుతున్నారు. అన్ని కుదిరితే 'అదుర్స్‌2'ని మీ కోసం చేస్తాను. నాని గొప్పనటుడు. ఆయన భిగ్‌బాస్‌ని బాగా చేస్తున్నాడు. అసలు ఈ విషయంలో పోలిక తేవడం, నన్ను అడగటం సరికాదు. బిగ్‌ బాస్‌ విజయవంతమైన ఫ్లాట్‌ఫాం. దానికి అంతం లేదని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చాడు. 

JR NTR Speech about His First MOBILE Phone at Celekt Mobiles Launch:

Jr Ntr About His Son Abhay Ram at Celekt Mobiles Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ