మనదేశంలో న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలు ఉన్నా కూడా వాటిపై నమ్మకం ఉండటం లేదు. ఎందుకంటే అధికారుల అవినీతి, బడా బాబుల ప్రమేయం, ఏళ్లకు ఏళ్లు కోర్టులో కేసులు సాగుతూ ఉండటం వీటికి కారణాలుగా చెప్పుకోవాలి. ఈ విషయంలో మనం అమెరికా వంటి దేశాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక విషయానికి వస్తే మన దేశంలో బడాబాబులు చేసే మోసాలు, వైట్కాలర్ దోపిడీలను మనం ఏమీ చేయలేకపోతున్నాం. కానీ అమెరికాలోని చికాగోలో కిషన్ మోదుగుమూడి దంపతుల విచారణ ఇప్పటికే అక్కడి పోలీసులు పూర్తి చేశారు. ఈనెల 18న కోర్టు వారికి శిక్ష విధించనుంది. తెలుగు హీరోయిన్లు, యాంకర్లను పలు సంఘాల వేడుకల కోసం అమెరికా రప్పించి అక్కడ డబ్బున వారితో వారిని వ్యభిచారం దందా చేయించిన కిషన్, ఆయన భార్య చంద్రకళలు విచారణ అనంతరం దోషులేనని అమెరికన్ పోలీసులు తేల్చారు. ఈ కేసులో వారు దోషులేనని న్యాయస్థానం కూడా తీర్పు చెప్పింది. ఈ కేసు విచారణలో భాగంగా ఐదు మంది హీరోయిన్లు సాక్ష్యాలను, వారి బ్యాంక్ అకౌంట్లలో జమ అయిన మొత్తం డాలర్లను, వారి ప్రయాణ తేదీలతో పాటు కిషన్ ఇంట్లో సేకరించిన సమాచారాన్ని కూడా పోలీసులు న్యాయస్థానంకి సాక్ష్యంగా సమర్పించారు.
విచారణ అనంతరం వారిని దోషులుగా ప్రకటించిన న్యాయస్థానం ఈనెల 18న తీర్పు ఇచ్చి, శిక్ష విధించనున్నట్లు తెలిపింది. వీరిద్దరు అక్రమంగా అమెరికాలో ఉంటున్నట్లు ఇప్పటికే పోలీసులు తేల్చారు. శిక్ష అనుభవించిన తర్వాత వారిని ఇండియాకు డిపోర్ట్ చేస్తామని అమెరికన్ అధికారులు తెలిపారు.