Advertisementt

శర్వా, సాయి పల్లవి సినిమాలో భూకంపం!!

Mon 16th Jul 2018 09:29 PM
hanu raghavapudi,sai pallavi,sharwanand,climax,padi padi leche manasu movie,earthquake  శర్వా, సాయి పల్లవి సినిమాలో భూకంపం!!
Hanu Raghavapudi Gives Earthquake Shock To Sharwa, Sai Pallavi శర్వా, సాయి పల్లవి సినిమాలో భూకంపం!!
Advertisement
Ads by CJ

మహానుభావుడు సినిమా తర్వాత శర్వానంద్ రెండు సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించాడు. హను రాఘవపూడి తో పడి పడి లేచె మనసు అంటున్న శర్వానంద్... సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాని చేస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో దేశభక్తి గల సైనికుడిలా కనిపించనున్న శర్వానంద్ ఈ సినిమాలో ఫిదా హీరోయిన్ సాయి పల్లవితో రొమాన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పడి పడి లేచె మనసు సినిమా పోస్టర్స్ లో సాయి పల్లవి, శర్వానంద్ ల జోడి అదిరిపోయేలానే కనబడుతుంది. కలకత్తా పరిసరప్రాంతాల్లో సుదీర్ఘ‌మైన షెడ్యూల్ ని పూర్తి చేసుకుని హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ అలాగే... నేపాల్ వంటి దేశంలోనూ మరో షెడ్యూల్ కి చిత్రం ప్లాన్ చేస్తుంది.

అయితే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ సాయి పల్లవి నటన అనే మాట వినబడుతుంది. ఫిదా, ఎంసీఏ సినిమాల్లో సాయి పల్లవి అందంతో కన్నా ఎక్కువగా నటనతోనే మార్కులు కొట్టేసింది. ఇక ఈ సినిమాలో అంటే పడి పడి లేచె మనసు సినిమాలో కూడా సాయి పల్లవి - శర్వా కలిసి ఉన్న ఫొటోలో సాయి పల్లవి లుక్స్ కానివ్వండి.. ఆమె ముఖ కవళికలు కానివ్వండి.. ఆమె యాక్టీవ్ నెస్ కానివ్వండి అన్ని సూపర్ అనిపించేలా ఉండడమే కాదు.. శర్వానంద్ - సాయి పల్లవిల జోడి కూడా అంతేబావుంది. ఇకపోతే ఈ సినిమాలో హైలెట్ అనిపించేలా ఈ సినిమా క్లైమాక్స్ ఉండబోతుందని ఫిలిం నగర్ టాక్. ఇంతవరకు టాలీవుడ్ మూవీస్ లో చూడని  క్లైమాక్స్ ని ఈ పడి పడి లేచె మనసు సినిమా కోసం హను రాఘవపూడి రాసుకున్నాడట.

ఈ క్లైమాక్స్ లో భారీ  విజువ‌ల్ గ్రాఫిక్స్‌, ఎఫెక్ట్స్‌ ఉంటాయని.... ఇక ఈ సినిమా క్లైమాక్స్‌లో భూకంపం వ‌చ్చే స‌న్నివేశాన్ని సినిమాకే  హైలైట్‌గా తీర్చిదిద్దుతున్నార‌ట‌. హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఇప్పటికే ఈ క్లైమాక్స్ సెట్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ క్లైమాక్స్ లో భూకంపం అవ‌స‌ర‌మేంటో తెర‌పై చూస్తేనే మజా వస్తుంది అని అంటున్నారు. మరి మహానుభావుడు హిట్ తో ఉన్న శర్వానంద్ ఈ సినిమాతోనూ మరో హిట్ కొట్టేసేలానే కనబడుతున్నాడు.

Hanu Raghavapudi Gives Earthquake Shock To Sharwa, Sai Pallavi:

Director Hanu Raghavapudi Padi Padi Lechenu Manasu Movie Climax Revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ