Advertisementt

'సాక్ష్యం'కి తిప్పలు తప్పేలా లేవుగా..!!

Tue 17th Jul 2018 01:21 PM
bellamkonda srinivas,saakshyam,buyers,srivas  'సాక్ష్యం'కి తిప్పలు తప్పేలా లేవుగా..!!
Problems Started to Bellamkonda Srinivas Saakshyam 'సాక్ష్యం'కి తిప్పలు తప్పేలా లేవుగా..!!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో నిర్మాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ఒకరు. ఈయన నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు అనే విషయం తెలిసిందే. మొదటి చిత్రం 'అల్లుడుశీను' నుంచి 'జయజానకి నాయకా' వరకు ఈయన చిత్రాలలో టాప్‌స్టార్స్‌ చిత్రాలలో నటించే టాప్‌ హీరోయిన్లు, ఎంతో డిమాండ్‌ ఉన్న వారు క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా, సపోర్టింగ్‌ యాక్టర్లుగా మంచి ప్యాడింగ్‌తో వరుసగా ఈ హీరో మీద నిర్మాతలు 40కోట్ల బడ్జెట్‌ దాకా పెట్టుబడి పెడుతున్నారు. 

దాంతో ఆయా చిత్రాలు ఫర్వాలేదనిపించినా కాస్ట్‌ ఫెయిల్యూర్‌గా నిలుస్తున్నాయి. ఇక ఈయన సరసన సమంత, తమన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్‌, తాజాగా శ్రీవాస్‌ దర్శకత్వంలో వస్తున్న 'సాక్ష్యం'లో పూజా హెగ్డే వంటివారు నటిస్తున్నారు. ఇక ఈచిత్రం విడుదలకు ముందే డిజిటల్‌ రైట్స్‌, శాటిలైట్‌, థియేటిక్‌ రైట్స్‌ అన్ని కలిపి బడ్జెట్‌ సరిపోయిన విధంగా 40కోట్లు వచ్చిందని అంటున్నారు. అయితే అసలు సమస్య అక్కడే ఉంది. 'జయజానకి నాయకా' చిత్రం విషయంలో కూడా మొదట బడ్జెట్‌కి సరి సమానమైన బిజినెస్‌ జరిగింది. కానీ చివరి నిమిషంలో మాత్రం బయ్యర్లు అంత మొత్తం ఇవ్వలేం.. ఈ హీరో వల్ల అంత మొత్తం వర్కౌట్‌ కాదు.. అని చిత్రం రిలీజ్‌కి ముందు నానా ఇబ్బందులు పెట్టారు. దాంతో చివరి నిమిషంలో నిర్మాతే స్వయంగా హడావుడిగా విడుదల చేసుకోవాల్సి వచ్చింది. షరామామూలు గానే చిత్రం కాస్ట్‌ ఫెయిల్యూర్‌గా నిలిచి డెఫిషిట్‌ వచ్చింది. 

ఇక ఇదే తంతు 'సాక్ష్యం'కి కూడా ఎందురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోయపాటి చిత్రానికే 40కోట్లు అంటే పట్టించుకోలేదు. మరి శ్రీవాస్‌ చిత్రం 40కోట్లు అంటే అది జరిగే వ్యవహారంగా కనిపించడం లేదు. దీంతో నిర్మాత అభిషేక్‌ నామా టెన్షన్‌ పడుతున్నాడు. పబ్లిసిటీ విషయంలో బెల్లంకొండ సురేష్‌కి, అభిషేక్‌ నామాలకు స్పర్ధలు వచ్చాయని తెలుస్తోంది.

Problems Started to Bellamkonda Srinivas Saakshyam:

Buyers Betting High On Bellamkonda's Saakshyam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ