Advertisementt

'సంజు' ఊహించని విధంగా దూసుకెళుతుంది!

Wed 18th Jul 2018 01:23 PM
ranbir kapoor,sanju movie,300 crore club,sanjay dutt biopic  'సంజు' ఊహించని విధంగా దూసుకెళుతుంది!
Sanju Creates Sensation at Box Office 'సంజు' ఊహించని విధంగా దూసుకెళుతుంది!
Advertisement
Ads by CJ

సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'సంజు'. ప్రస్తుతం ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ధ్రువీకరించాడు. కేవలం ఇండియాలోనే  300 కోట్లు వసూల్ చేయడం విశేషం.

ఇక ఇతర దేశాల్లో మొత్తంగా 200 కోట్లు వసూల్ చేసింది. గత నెల జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ చిత్రం మూడు వారాల్లోనే 500 కోట్ల మార్కును అందుకోవడం విశేషం. తొలి వారంలోనే 200 కోట్లు వసూల్ చేసి ఆ తర్వాత రెండు.. మూడు వారాల్లో జోరు కొనసాగిస్తూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రానికి ప్లస్ అయింది. అయితే రాజ్ కుమార్ హిరాని ఇంతకు ముందు తీసిన నాలుగు సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. అందులో ముఖ్యంగా అమీర్ ఖాన్ నటించిన ‘3 ఇడియట్స్’, ‘పీకే’ చిత్రాలు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు సాధించాయి.

అయితే ఆ సినిమాల్లో అమీర్ ఖాన్ ఉన్న సంగతి తెలిసిందే. అతడి బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో కూడా తెలుసు. కానీ ఈసారి రణబీర్ కపూర్ లాంటి మీడియం రేంజ్ హీరోను పెట్టుకుని కూడా హిరాని బాక్సాఫీస్‌ను షేక్ చేసి, మరోసారి 'సంజు' తో రుజువు చేశాడు. ఇక ఈ ఆదివారంతో ఈ సినిమా 316.64 కోట్లతో బాలీవుడ్ చరిత్రలోనే అత్యధికంగా వసూలు చేసిన ఐదో చిత్రంగా నిలిచింది.

Sanju Creates Sensation at Box Office:

Sanju joins 300 crore club

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ