విద్యాబాలన్ ను ఆత్మీయంగా స్వాగతించిన ఎన్.టి.ఆర్ కుటుంబం
బాలీవుడ్ నటీమణి విద్యాబాలన్ నేడు ఎన్.టి.ఆర్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి పూల బొకేతో విద్యాబాలన్ కు స్వాగతం తెలిపారు. అలాగే.. నందమూరి వంశం రివాజు ప్రకారం ఆమెకు చీరను బహుకరించారు.
ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఆయన సతీమణి బసవతారకం పాత్ర పోషించనున్న విద్యాబాలన్ ఎన్.టి.ఆర్ కుటుంబ సభ్యుల నుంచి ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవడంతోపాటు.. లోకేశ్వరిని అడిగి బసవతారకం వ్యవహారశైలి ఎలా ఉంటుంది, ఆమెకు ఇష్టమైన విషయాలేమిటి, హాబీస్ ఏమిటి అనేవి అడిగి తెలుసుకున్నారు విద్యాబాలన్. ఈ ఆత్మీయ పరిచయ తేనీటి విందులో నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర దేవి, ఆయన చిన్నకుమార్తె తేజస్విని మరియు ఆయన చిన్న అల్లుడు శ్రీభరత్ పాలుపంచుకున్నారు.
నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన విద్యాబాలన్ బుధవారం నుంచి ఎన్.టి.ఆర్ సెట్స్ లో పాల్గొననున్నారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. విద్యాబాలన్ ఓ వైవిధ్యమైన గెటల్ లో కనిపించనున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. నందమూరి బాలకృష్ణ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని సాయికొర్రపాటి, విష్ణు ఇందూరు సమర్పిస్తున్నారు.
నటీనటులు:
నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నరేష్ వి.కె, మురళీశర్మ, ప్రకాష్ రాజ్ తదితరులు..
సాంకేతిక బృందం:
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు: నందమూరి బాలకృష్ణ, విష్ణువర్ధన్ ఇందూరి, సాయి కొర్రపాటి-ఎం.ఆర్.వి.ప్రసాద్
బ్యానర్లు: ఎన్.బి.కె ఫిలిమ్స్-విబ్రా మీడియా-వారాహి చలనచిత్రం
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వి.ఎస్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్