Advertisementt

కన్ఫ్యూజన్ లో కైరా అద్వాని!

Fri 20th Jul 2018 12:39 PM
kiara advani,bollywood,bharat ane nenu,tollywood,confusion  కన్ఫ్యూజన్ లో కైరా అద్వాని!
Heroine Kiara Advani in Confusion కన్ఫ్యూజన్ లో కైరా అద్వాని!
Advertisement
Ads by CJ

'భరత్ అనే నేను'లో తన క్యూట్ లుక్స్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీకి పెద్ద సమస్య వచ్చిపడింది. అమ్మడికి బాలీవుడ్ లో సరైన అవకాశాలు లేని సమయంలో తెలుగులో అవకాశం అందిపుచ్చుకొని.. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీయస్ట్ హీరోయిన్ గా నిలిచింది. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాలో కథానాయికగా నటిస్తున్న కైరా అద్వానీకి బోలెడన్ని ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇక్కడే పెద్ద సమస్య వచ్చిపడింది.

విషయం ఏంటంటే.. నిన్నమొన్నటివరకూ బాలీవుడ్ లో సరైన అవకాశాలు లేవు కాబట్టి తెలుగులో ఆఫర్ల కోసం వెంపర్లాడిన కైరా అద్వానీకి ఇప్పుడు బాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన 'లస్ట్ స్టోరీస్' మోస్ట్ వ్యూస్ వెబ్ సిరీస్ గా ట్రెండ్ క్రియేట్ చేసిన అనంతరం బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. 

ఒక్క కరణ్ జోహారే అమ్మడికి ఏకంగా మూడు ప్రొజెక్ట్స్ ఆఫర్ చేశాడట. అలాగే.. మరింత మంది దర్శకులు కూడా కైరాకు కథానాయిక క్యారెక్టర్లు ఇస్తామంటూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారట. దాంతో.. ఇప్పుడు తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన బాలీవుడ్ ఆఫర్లు అందుకోవాలా లేక కెరీర్ ను నిలబెట్టిన టాలీవుడ్ లోనే కంటిన్యూ అవ్వాలా అనే విషయాన్ని తేల్చుకోలేక కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతుందట. మరి కైరాకి టాలీవుడ్ లో సెటిల్ అవ్వాలా లేక బాలీవుడ్ కి రిటర్న్ అవ్వాలా అనే విషయంలో క్లారిటీ రావాలంటే కాస్త టైమ్ పట్టేలా ఉంది.

Heroine Kiara Advani in Confusion :

Kiara Advani Busy with Movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ