అతి తక్కువ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న హీరోయిన్, మలయాళ కుట్టి నివేదాథామస్, 'జెంటిల్‌మేన్'తో పరిచయమై ఆ తర్వాత 'నిన్నుకోరి, జైలవకుశ' వంటి చిత్రాలతో హిట్స్‌ని సొంతం చేసుకుంది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పింది.
నేను ఆర్కిటెక్ట్‌ని. నా చదువు కూడా పూర్తయింది. అయితే నేను ప్రస్తుతం ఆర్కిటెక్ట్‌గా పనిచేయడం లేదు. సినిమాలపైనే దృష్టి పెట్టాను, ప్రస్తుతం కళ్యాణ్‌రామ్ హీరోగా రూపొందుతున్న ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాను. దీని తర్వాత సూపర్ క్రేజీ కాంబినేషన్‌లో ఓ చిత్రం చేయనున్నాను. నాకు డొమినోస్, కెఎఫ్‌సి వంటి వాటికంటే ఇడ్లీ, సాంబార్, వడ అంటే ఇష్టం. ఇక నాకు ఇష్టమైన కో స్టార్ నాని. నా ఇల్లు చెన్నై, కానీ హైదరాబాద్ అంటే నాకు బాగా ఇష్టం. నేను హైదరాబాద్, కేరళలో కంటే ఎక్కువగా చెన్నైలో గడుపుతుంటాను.
'జెంటిల్‌మేన్, నిన్నుకోరి' చిత్రాలు రెండు నాకిష్టమే. చదువుకుంటూనే నటించడానికి పెద్దగా టెన్షన్ పడలేదు. వాటిని ఇష్టపడుతూ పూర్తి చేస్తున్నాను. మంచి నటిగా, మంచి చిత్రాలు చేయడమే నాముందున్న లక్ష్యం. నాకు బైక్ నడపడం వచ్చు. సినిమాలను థియేటర్లలో ప్రేక్షకుల మధ్య చూసి బాగా ఎంజాయ్ చేస్తాను. నేను ఐదు భాషలు అనర్గళంగా మాట్లాడగలను. నా బెస్ట్ ఫ్రెండ్ నాని. నా మొబైల్ నెంబర్ మాత్రం ఎవ్వరికీ ఇవ్వను.. అని పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.