Advertisementt

'ఎన్టీఆర్' బయోపిక్ వంద కోట్లు అయితేనే..!!

Sun 22nd Jul 2018 12:42 PM
balakrishna,ntr biopic,100 crore club  'ఎన్టీఆర్' బయోపిక్ వంద కోట్లు అయితేనే..!!
NTR Biopic pre Release Business Details 'ఎన్టీఆర్' బయోపిక్ వంద కోట్లు అయితేనే..!!
Advertisement
Ads by CJ

ఎన్నో అడ్డంకుల మధ్య ఎన్టీఆర్ జీవిత కథ 'ఎన్టీఆర్' బయోపిక్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ భార్య పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్.. రానా..ఇంకా చాలామంది ప్రముఖ నటులు ఇందులో యాక్ట్ చేస్తున్నారు.

సావిత్రిగా కీర్తి సురేష్..శ్రీదేవి పాత్రలో రకుల్ నటిస్తుందని టాక్. అంతేకాకుండా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఈ సినిమాతో తెలుగు తెరపై అడుగు పెట్టనున్నాడని ఫిలింనగర్ సమాచారం. ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఇంకా షూటింగ్ తొలిదశలో ఉండగానే ఈ సినిమా ఏరియాల వారి హక్కుల కోసం ప్రయత్నాలు మొదలైపోయినట్టుగా వినికిడి.

సినిమా రేట్లు చాలా ఎక్కువగా చెబుతున్నారని వినికిడి. 'మహానటి' సినిమా 40 కోట్ల షేర్ ను రాబట్టిందని.. 'ఎన్టీఆర్' బయోపిక్ అంతకి రెట్టింపు వసూలు చేయగలదనే నమ్మకంతోనే భారీ రేట్లు చెబుతున్నారట. ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్.. ఫాలోయింగ్...అన్నీ చూసుకుని ఈ సినిమాను అన్ని హక్కులను కలుపుకుని 100 కోట్లకి తక్కువగా అమ్మే ఆలోచనలో నిర్మాతలు లేరట. చూద్దాం ఈ సినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో ఇంకా. త్వరగా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

NTR Biopic pre Release Business Details:

Balayaa To Enter 100 Crore Club with NTR Biopic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ