Advertisementt

నంద గోపాలకృష్ణుడి పుట్టినరోజు లుక్!

Mon 23rd Jul 2018 02:55 PM
suriya,birthday,ngk movie,second look,release  నంద గోపాలకృష్ణుడి పుట్టినరోజు లుక్!
Suriya 36, NGK (Nandha Gopala Krishna) For Deepavali నంద గోపాలకృష్ణుడి పుట్టినరోజు లుక్!
Advertisement
Ads by CJ

'గజిని', 'సింగం' సిరీస్‌ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సంపాదించుకున్న హీరో సూర్య 36వ చిత్రంగా రూపొందుతున్న 'న్గక్' (నంద గోపాలకృష్ణ)తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. '7జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీరాఘవ దర్శకత్వంలో, రీసెంట్‌గా 'ఖాకి' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై 'న్గక్' (నంద గోపాలకృష్ణ) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెకండ్‌ లుక్‌ పోస్టర్‌ను హీరో సూర్య పుట్టినరోజు(జూలై 23) సందర్భంగా విడుదల చేశారు. సూర్య సరసన సాయి పల్లవి, రకుల్‌ప్రీత్‌ నటిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. 

సూర్య, సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌, ఎడిటింగ్‌: జి.కె.ప్రసన్న, ఆర్ట్‌: ఆర్‌.కె.విజయ్‌ మురుగన్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆరవేంద్రాజ్ భాస్కరన్, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, దర్శకత్వం: శ్రీరాఘవ

Suriya 36, NGK (Nandha Gopala Krishna) For Deepavali:

NGK Second Look Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ