Advertisementt

రూమర్స్ ఆపుతారా.. సాక్ష్యం ఇదిగో..!

Tue 24th Jul 2018 03:12 PM
saakshyam,bellamkonda srinivas,sreewas,release date  రూమర్స్ ఆపుతారా.. సాక్ష్యం ఇదిగో..!
Saakshyam Worldwide grand release on July 27th రూమర్స్ ఆపుతారా.. సాక్ష్యం ఇదిగో..!
Advertisement
Ads by CJ

సాక్ష్యం మూవీ రిలీజ్ విషయంలో మీడియాలో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేస్తూ సినిమా నిర్మాతలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జులై 27న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా యొక్క ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది.

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, గ్లామర్ డాల్ పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందగా ప్రకృతిలోని పంచభూతాలు అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ బాగుండటంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. సాంగ్స్ కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా 12 నిమిషాల పంచభూతాల సాంగ్ కి మంచి ఆదరణ లభిస్తోంది. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్, రావు రమేష్, రవి కిషన్, అశుతోష్ రాణా, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్ మరియు మీనా లు నటించగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పతాకంపై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Saakshyam Worldwide grand release on July 27th:

Saakshyam Movie Release Date Fixed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ