బుల్లితెర యాంకర్‌గా, నటిగా, హోస్ట్‌గా ఝాన్సీకి మంచి పేరుంది. ఇక ఈమె పలు చిత్రాలలో నటించి మంచి పేరు సాధించింది. బుల్లితెరపై సామాజిక చైతన్యం కలిగిన ప్రోగ్రామ్స్‌ని నిర్వహించింది. కానీ ఈమె పెద్ద పేచీ మనిషి అనే చెడ్డపేరు మాత్రం ఉంది. ఆమె వ్యక్తిగత, వివాహజీవితం నుంచి ఆర్.నారాయణమూర్తితో సహా అందరితో ఈమెకి విబేధాలున్నాయి. ఇక ఈమె తాజాగా మాట్లాడుతూ, కెరీర్‌లో తనకెదురైన కొన్ని అనుభవాలను వివరించింది.
నేను ఎవ్వరినీ కూడా వర్క్ ఇవ్వమని ఇప్పటివరకు అడగలేదు. అలాగే అవతలి వారు ఇవ్వాల్సిన డబ్బుల గురించి పదే పదే అడిగే అలవాటు నాకు లేదు. డబ్బుల కోసం గొడవలు పడలేదు. ఇళ్లకు మనుషులను పంపలేదు. నా మనసుకి కష్టం కలిగించిన వారిని కట్ చేసే దానిని అంతే. నన్ను ఇబ్బంది పెట్టిన వారికి నా శాపం బాగా తగిలింది. రెండురోజులు క్యారెక్టర్ చేయించుకుని తీసేసిన వారికి నా శాపం ఎంత బలమైనదో బాగా తెలుసు.
ఒక పెద్ద డైరెక్టర్.. పెద్ద హీరో నాతో ఓ పాత్రని రెండు రోజులు చేయించుకున్నారు. నా డబ్బులు నాకిచ్చేశారు. నాకు చెప్పాపెట్టకుండా ఆ పాత్రను వేరే వారి చేత చేయించి నన్ను అవమాన పరిచారు. వాళ్లకి నా శాపం బాగా తగిలింది. ఇంతవరకు వారు మరలా కోలుకోలేదు అని చెప్పుకొచ్చింది. ఆడదాని ఉసురు ఊరికే పోదనేది ఝాన్సీ విషయంలో నిజమైనట్లు కనిపిస్తోంది. ఇంతకీ ఆ పెద్ద డైరెక్టర్, స్టార్ హీరో ఎవరు? అనేదే సస్పెన్స్‌గా మారింది. ఈ విషయంలో పలువురు పలువురి పేర్లను ఊహించుకుంటూ ఉన్నారు. మరి నిజం ఏమిటో ఆమె చెబితే గానీ తెలియదు సుమా!