Advertisementt

పవన్‌ చెప్పింది నిజమే....!

Thu 26th Jul 2018 06:53 PM
pawan kalyan,ys jagan,janasena,counter attack  పవన్‌ చెప్పింది నిజమే....!
YS Jagan Threatened by Pawan Kalyan! పవన్‌ చెప్పింది నిజమే....!
Advertisement
Ads by CJ

పవన్‌ చేస్తున్న ఆరోపణలు, ఆయన మాట్లాడుతున్న మాటలు కాస్త నిరాశ పరుస్తూ సగటు మనిషికి కూడా హాస్యాస్పదంగానే ఉంటున్నాయి. అయితే పవన్‌ రాజకీయ కార్యాచరణను, ఆయన భావాలను మాత్రం సమర్దించాల్సివుంది. కుల రాజకీయాలకు మారుపేరైన పవన్‌ కిందటి ఎన్నికల్లో టిడిపికి మద్దతు ఇచ్చినప్పుడే ఆయన చిత్తశుద్ది ప్రజలకు అర్ధమైంది. అలాగే ఇటీవల ఆయన మాట్లాడుతూ, మహాత్మాగాంధీ వైశ్య  కులంలో పుట్టిన వాడైనంత మాత్రాన ఆయనను వైశ్యనేతగా చూస్తామా? అనే ప్రశ్న ఎంతో లోతుల్లోకి వెళ్లి చేసిందిగా కనిపిస్తోంది. నచ్చడం, నచ్చకపోవడం పక్కన పెడితే ఆయన ఐడియాలజీ మాత్రం తటస్తులను బాగా ఆకట్టుకుంటోంది. ఇదే సమయంలో జగన్‌ పవన్‌ని తాజాగా వ్యక్తిగతంగా దూషించి, నానా మాటలు అన్నాడు. దీనిపై పవన్‌ అభిమానుల నుంచే కాదు.. ప్రతి ఒక్కరి నుంచి తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

ఇక తాజాగా పవన్‌ జగన్‌ వ్యాఖ్యలపై స్పందించాడు. నేను బలమైన వ్యక్తిని కనుకనే జగన్‌ నాపై విమర్శలు చేశాడు. మార్పు కోసం ప్రయత్నిస్తున్నాననే నన్ను జగన్‌, బిజెపిలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్‌కే అంతుంటే నిజాయితీ పరుడినైన నాకెంత ఉండాలి? భారత రాజ్యాంగాన్ని రాసింది చంద్రబాబో, జగనో కాదు. రాజకీయాలకు శ్రమ, ఓపిక ఎంతో అవసరమని నాకు తెలుసు. సామాజిక మార్పు తీసుకుని రావడం నా లక్ష్యం. దానికోసం శక్తివంతమైన సినిమా మీడియాను ఉపయోగించుకున్నాను. స్వార్ధ రాజకీయాల కోసం కొందరు రాజకీయ నాయకులు ప్రజల మధ్య చిచ్చు పెట్టి విభజించి పాలిస్తున్నారు. అటువంటి వారిని ఎదిరించడానికే జనసేన పార్టీని స్థాపించాను. జనసేన మూడో ప్రత్యామ్నాయంగా, మూడో ఆలోచనా విధానంతో రావడం వల్లే ఉద్దానం, ఉండవల్లి వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను బయటికి తెచ్చింది ఏ పెద్ద రాజకీయ నాయకుడో కాదు. కేవలం ఓ సాధారణ జనసైనికుడు. 

ప్రతి మండలానికి 15 నుంచి 20మందితో ఓ కమిటి వేస్తాను. ప్రజాసమస్యలకే ప్రాధాన్యం ఇచ్చి గ్రామ గ్రామాల నుంచి అన్నిచోట్లా ప్రజల కష్టాలు, సమస్యలు, కన్నీళ్లు, బాధలు, వ్యధలు స్వయంగా తెలుసుకోండి.. మీరు తెచ్చిన సమాచారంతోనే భావితరాలకు ఏమి చేయగలమనే విషయాలను నిర్ణయిద్దాం. రాజకీయాలకు వేలకోట్లు అవసరం లేదు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ది ఉంటే ప్రజలే మన వెనుక ఉంటారు. వేలకోట్ల డబ్బు ఉంటే అహంకారం, తలపొగరు పెరుగుతాయి. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. బెదిరించి, గూండాయిజం చూపిస్తే భయపడవద్దు. ధైర్యంగా ఎదుర్కోండి... అని ఆయన జన సైనికులకు దిశానిర్దేశం చేశారు. ఇంత లోతుగా మాట్లాడిన పవన్‌ కొన్నిసార్లు మాత్రం అనాలోచితంగా ఎందుకు మాట్లాడుతాడు? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. నిజంగా పవన్‌ కుల, మతాలకు అతీతంగా ప్రజల ముందుకు చిత్తశుద్దితో వస్తే ఆయన ఏపీకి మరో కేజ్రీవాల్ అయినా ఆశ్చర్యంలేదు. కానీ పవన్‌ ఎప్పుడు ఎలా ఉంటాడో మాత్రం అర్ధం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. 

YS Jagan Threatened by Pawan Kalyan!:

YS Jagan to Face Pawan's Attack    

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ