మహేష్ బాబు 25 వ మూవీ పట్టాలెక్కడానికి చాలా సమస్యలెదుర్కుంది. ఎట్టకేలకు వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు - పూజా హెగ్డే తో కలిసి సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. కీలకం అంటే మహేష్ బాబు ఫ్రెండ్ పాత్రలో టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ సినిమా సెట్స్ లో ఎప్పుడో జాయిన్ అయ్యాడు. దిల్ రాజు - అశ్వినీదత్ - పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ అస్సలు గ్యాప్ లేకుండా జరుపుకుంటుంది. రైతు సమస్యలు ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న విడుదల డేట్ లాక్ చేశారు. అయితే మహేష్ 25 వ మూవీ సినిమా కథ గురించిన ముచ్చట్లు సోషల్ మీడియాలో చాలానే జరిగాయి.
తాజాగా మహేష్ 25 వ మూవీ కథ లీకైందంటూ ఫిలింసర్కిల్స్ లో ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సంపన్న కుటుంబంలో పుట్టి... రైతు కుటుంబం నుండి వచ్చిన అల్లరి నరేష్ తో కాలేజ్ లో స్నేహం చెయ్యడం... చదువు పూర్తయ్యాక ఎవరి ఊళ్లకు వాళ్ళు వెళ్ళిపోయి సెటిల్ అవుతారు. అయితే కొంత గ్యాప్ తర్వాత అనుకోని సంఘటనతో మహేష్, అల్లరి నరేష్ ని కలుసుకోవడం.... అయితే నరేష్ చెప్పిన కొన్ని విషయాలు తెలుసుకున్న మహేష్... నరేష్ ని తీసుకుని వారి వూరు వెళ్లడం.. అక్కడ సమస్య నరేష్ ది మాత్రమే కాదు.. అక్కడున్న రైతులందరిది అని తెలుసుకున్న మహేష్ రైతులకు మంచి చేసే పని ఒకటి తలపెట్టగా.. అది సెన్సేషన్ అవడం... ఇదంతా మహేష్ 25 మూవీ కథగా ప్రచారం జరుగుతుంది. ఇక మహేష్ తన స్నేహితుడు నరేష్ తో కలిసి ఆ సమస్యలను, తలపెట్టిన ఆ మంచి పనిని ఎలా పూర్తి చేశాడో అనేది వంశి పైడిపల్లి ట్విస్టుల మీద ట్విస్టులతో చూపిస్తాడట.
ఇక ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ మిస్టర్ పర్ఫెక్ట్ మాదిరి, అలాగే త్రీ ఇడియట్స్ లో అమీరా ఖాన్ మాదిరి ఉండబోతుందట. మరి ఈ సినిమాలో రైతు సమస్యలను సున్నితంగా టచ్ చేస్తూనే ఒకమంచి మెస్సేజ్ ఈ సినిమా ద్వారా అందించబోతున్నారట వంశి పైడిపల్లి టీమ్. ఇక ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజా హెగ్డే సాఫ్ట్ వేర్ అమ్మాయిగా కనబడబోతోంది.