డీజే దువ్వాడ జగన్నాధం పూజ హెగ్డే తల రాతని మార్చేసిన సినిమా. ఒకే ఒక్క సినిమాతో పూజ ఒక్కసారిగా టాప్ హీరోయిన్స్ కి చమట్లు పట్టించింది. డీజే లో వేసిన బికినీ పూజ ని ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ ని చేసేసింది. అల్లు అర్జున్ పక్కన డీజే సినిమాలో పూజ వేసిన డాన్స్ కానివ్వండి.. గ్లామర్ షో కానివ్వండి ఆమెకి అన్ని మంచే చేశాయి. డీజే తర్వాత బెల్లకొండ శ్రీనివాస్ పక్కన భారీ పారితోషకాన్ని అందుకుని మరీ సాక్ష్యం సినిమాలో నటించింది. ఆ సినిమా షూటింగ్ లో ఉండగానే ఎన్టీఆర్ పక్కన అరవింద సమేతలోనూ, మహేష్ బాబు పక్కన మహేష్ 25 మూవీ లోను ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ప్రభాస్ పక్కన కూడా ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినబడుతుంది.
మరి పూజకి కేవలం డీజే క్రేజ్ తోనే ఎన్టీఆర్, అండ్ మహేష్ సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. కానీ అమ్మడుకి సాక్ష్యం సినిమా మధ్యలో ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ తనకున్న పలుకుబడితో శ్రీనివాస్ ని పెద్ద స్టార్ ని చెయ్యాలని కంకణం కట్టుకున్నాడు. అందుకే భారీ ప్రాజెక్టులతో స్టార్ హీరోయిన్స్ తో శ్రీనివాస్ తో సినిమాలు చేయిస్తున్నాడు. అయితే ఈ రోజు విడుదల కాబోయే సాక్ష్యం సినిమాకి మెయిన్ గా ప్రధాన ఆకర్షణ పూజ హెగ్డే నే. పూజ పైన భారీ క్రేజ్ తో సాక్ష్యం సినిమా హిట్ మీద శ్రీనివాస్ కూడా ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాలో పూజ గ్లామర్ కూడా ప్రధాన ఆకర్షణ లానే కనబడుతుంది.
ఇక ఈ సినిమా హిట్ అయితే ఎన్టీఆర్ అండ్ మహేష్ సినిమాల్లో పూజ హెగ్డే కి మరింత క్రేజ్ ఉంటుంది. ఇక ఆ సినిమాల మీద కూడా పూజ క్రేజ్.. సాక్ష్యం సినిమా హిట్ తో మరింత పెరిగే అవకాశం ఉంటుంది కూడా. మరి ఒకవేళ సాక్ష్యం సినిమా గనక అటు ఇటు అయ్యిందా పూజ కొచ్చిన క్రేజ్ కూడా పడిపోతుంది. కానీ పూజ హెగ్డే కి సాక్ష్యం సినిమా వలన పెద్దగా యూజ్ అయితే ఉండదు. అది హిట్ అయినా... లేదా ఫట్ అయినా. కానీ పూజ హెగ్డే గనక సాక్ష్యం సినిమా హిట్ అయితే మాత్రం ఆమెకున్న క్రేజ్ మరింత పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.