Advertisementt

మొన్న కాజల్.. ఇప్పుడేమో మహేష్..!

Sat 28th Jul 2018 07:36 PM
mahesh babu,vamsi paidipalli,birthday wishes,kajal agarwal,chiranjeevi  మొన్న కాజల్.. ఇప్పుడేమో మహేష్..!
Super Star Mahesh Birthday Wishes to Vamshi Paidipally మొన్న కాజల్.. ఇప్పుడేమో మహేష్..!
Advertisement
Ads by CJ

మనిషికి వయసు అనేది శారీరకమే గానీ మనసుకు కాదు. 60ఏళ్ల షష్టిపూర్తి వయసులో కూడా 20ఏళ్ల మనస్తత్వం ఉన్న వారు ఎందరో మనకి కనిపిస్తారు. ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు నుంచి చిరంజీవి వరకు ఇదే కోవలోకి వస్తారు. ఇటీవలే షష్టిపూర్తి పూర్తి చేసుకున్న మెగాస్టార్‌ చిరంజీవిని.. ఆయనతో 'ఖైదీనెంబర్‌ 150'లో కలిసి నటించిన కాజల్‌ అగర్వాల్‌ ఎంతో రొమాంటిక్‌, నేను పనిచేసిన యంగ్‌, సీనియర్‌ స్టార్స్‌ అందరిలోకి చిరునే బెస్ట్‌ రొమాంటిక్‌ పర్సన్‌ అని కితాబునిచ్చిన సంగతి తెలిసిందే. 

తాజాగా మహేష్‌బాబు కూడా ఇన్‌డైరెక్ట్‌గా ఇలాంటి విషయాన్నే చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మహేష్‌బాబు తన 25వ ప్రతిష్టాత్మక చిత్రంగా దిల్‌రాజు, అశ్వనీదత్‌ల భాగస్వామ్యంతో వంశీపైడిపల్లి దర్శకత్వంలో చిత్రం చేస్తున్నాడు. ఇక తాజాగా ఈ చిత్రం దర్శకుడు వంశీపైడిపల్లి తన 40వ పుట్టినరోజుని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా మహేష్‌బాబు, హరీష్‌శంకర్‌ వంటి వారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహేష్‌ మాట్లాడుతూ, వంశీ యంగ్‌ దర్శకుడు. 40ఏళ్ల యంగ్‌ దర్శకుడు ఆయన. నా స్నేహితుడు వంశీపైడిపల్లికి జన్మదిన శుభాకాంక్షలు. అనుమానం లేదు. 40ఏళ్లంటే 20ఏళ్లే. యంగ్‌గా, ఆనందంగా జీవించండి.. అని విషెష్‌ తెలియజేశాడు. 

ఈ సందర్భంగా మహేష్‌ తన తాజా చిత్రం షూటింగ్‌ సెట్స్‌లో వంశీపైడిపల్లితో కలిసి నవ్వుతూ నడుస్తున్న ఫొటోని పోస్ట్‌ చేశాడు. 'బహుముఖ ప్రతిభ ఉన్న దర్శకుడు. నా స్నేహితుడు, శ్రేయోభిలాషి వంశీపైడిపల్లికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది నీకు గొప్పగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నా మిత్రమా' అని హరీష్‌శంకర్‌ ట్వీట్‌ చేశాడు. ఇక మహేష్‌ 25వ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా, అల్లరి నరేష్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం డార్జిలింగ్‌ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరగనుంది. రైతుల సమస్యల మీద ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. 

Super Star Mahesh Birthday Wishes to Vamshi Paidipally:

Mahesh Babu wishes his director Apart from the birthday wishes, the actor also made a special

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ